Sanjay Raut: మహారాష్ట్రలో ప్రతిపక్ష మహావికాస్ అఘాడీకి షాక్

మహారాష్ట్రలో ప్రతిపక్ష పార్టీ మహావికాస్ అఘాడీకి షాక్ తగిలింది. శివసేన (యూబీటీ) (Shiv Sena (UBT)) కీలక నిర్ణయం తీసుకున్నారు.

Update: 2024-12-21 09:49 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలో ప్రతిపక్ష పార్టీ మహావికాస్ అఘాడీకి షాక్ తగిలింది. శివసేన (యూబీటీ) (Shiv Sena (UBT)) కీలక నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్ర (Maharashtra) రాజధాని ముంబై (Mumbai) పురపాలక ఎన్నికల్లో ఆ పార్టీ ఒంటరిగా పోటీ చేసే అవకాశం ఉందని సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్ (Sanjay Raut) తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఎన్సీపీ (ఎస్పీ)లతో పొత్తు పెట్టుకునేది లేదంటూ వెల్లడించారు. దీనిపై త్వరలోనే తమ పార్టీ నిర్ణయం వెలువరిస్తుందని ప్రకటించారు. ‘‘ముంబై పురపాలక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలంటూ శివసేన (యూబీటీ) కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. పార్టీ అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray) వారితో త్వరలో సమావేశం కానున్నారు. తర్వాత తుది నిర్ణయాన్ని వెల్లడిస్తాం. అయితే.. దీన్నిబట్టి మహావికాస్‌ అఘాడీ (ఎంవీఏ) విచ్ఛిన్నమైనట్లు అర్థం చేసుకోవద్దు. గతంలో మేం బీజేపీతో కలిసి ఉన్న సమయంలోనూ ఒంటరిగా పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి’’ అని సంజయ్‌రౌత్‌ గుర్తు చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో షాక్

కాగా.. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి మెరుగైన పనితీరు కనబరిచినప్పటికీ.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎంవీఏకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. 288 అసెంబ్లీ స్థానాలుండగా.. మహాయుతి కూటమి 230 సీట్లతో భారీ విజయం సాధించింది. మరోవైపు, ప్రతిపక్ష స్థానంలో ఉన్న ఎంవీఏ 48 సీట్లకే పరిమితమైంది. అయితే.. ఈ ఘోర పరాజయానికి కాంగ్రెస్‌ అతివిశ్వాసమే కారణమంటూ ఉద్ధవ్ వర్గం ఆరోపించింది. ఇలాంటి సమయంలో సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దీన్ని బట్టి వచ్చే ఏడాది జరగనున్న పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress), ఎన్సీపీ (ఎస్పీ)తో శివసేన (యూబీటీ) పొత్తు కుదుర్చుకునే అవకాశం లేనట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News