Bangladesh : కాస్త ఆలోచించి కామెంట్లు చేయండి.. ‘బంగ్లా’కు భారత్ హితవు
దిశ, నేషనల్ బ్యూరో : ‘‘అసలు కథ ఇప్పుడే మొదలైంది.. బంగ్లాదేశ్(Bangladesh) తన భూభాగాన్ని ఇక విస్తరించుకోవాలి’’ అంటూ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనుస్(Muhammed Yunus) సలహాదారుడు మహఫూజ్ ఆలం డిసెంబరు 16న ఫేస్‌బుక్‌లో వివాదాస్పద పోస్ట్ పెట్టారు.
దిశ, నేషనల్ బ్యూరో : ‘‘అసలు కథ ఇప్పుడే మొదలైంది.. బంగ్లాదేశ్(Bangladesh) తన భూభాగాన్ని ఇక విస్తరించుకోవాలి’’ అంటూ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనుస్(Muhammed Yunus) సలహాదారుడు మహఫూజ్ ఆలం డిసెంబరు 16న ఫేస్‌బుక్‌లో వివాదాస్పద పోస్ట్ పెట్టారు. అయితే దాన్ని ఇటీవలే డిలీట్ చేశారు. తాజాగా శుక్రవారం రోజు ఆ ఫేస్‌బుక్ పోస్ట్‌పై భారత(India) విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఘాటుగా స్పందించారు.
తాము బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వంతో స్నేహ సంబంధాలను కోరుకుంటున్నప్పటికీ.. అటువైపు నుంచి అభ్యంతరకర వ్యాఖ్యలు రావడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జన బాహుళ్యంలో వ్యాఖ్యలు చేసేటప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలనే విషయాన్ని కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్నవారు మర్చిపోయారని రణధీర్ జైస్వాల్ విమర్శించారు. ప్రజల ఎదుటకు ఏదైనా సందేశాన్ని పంపే ముందు.. కాస్త ఆలోచించాలని హితవు పలికారు.