నోకియా కొత్త ఫోన్లు.. ఫీచర్స్, రేట్లు ఇవే

న్యూఢిల్లీ : నోకియా మొబైల్ ఫోన్‌ల తయారీదారు హెచ్ఎండీ గ్లోబల్ ఆరు కొత్త సిరీస్‌లను విడుదల చేసింది. మార్కెట్ ఎంట్రీ లెవెల్, మిడ్ రేంజ్, టాప్ లైన్‌లలో భాగంగా ఆరు సిరీస్‌లను గురువారం వర్చువల్ కాన్ఫరెన్స్‌లో ప్రవేశపెట్టింది. ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్‌లో నోకియా సీ10, సీ20 మాడల్స్‌ను, మిడ్ రేంజ్‌లో జీ10, జీ20 మాడల్స్‌ను, టాప్ రేంజ్‌ సెగ్మెంట్‌లో ఎక్స్10, ఎక్స్20లను విడుదల చేసింది. సీ10, సీ20లు ఆండ్రాయిడ్ 11(గో ఎడిషన్)ను ఆఫర్ చేస్తుండగా, జీ10, జీ20, […]

Update: 2021-04-09 00:22 GMT

న్యూఢిల్లీ : నోకియా మొబైల్ ఫోన్‌ల తయారీదారు హెచ్ఎండీ గ్లోబల్ ఆరు కొత్త సిరీస్‌లను విడుదల చేసింది. మార్కెట్ ఎంట్రీ లెవెల్, మిడ్ రేంజ్, టాప్ లైన్‌లలో భాగంగా ఆరు సిరీస్‌లను గురువారం వర్చువల్ కాన్ఫరెన్స్‌లో ప్రవేశపెట్టింది. ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్‌లో నోకియా సీ10, సీ20 మాడల్స్‌ను, మిడ్ రేంజ్‌లో జీ10, జీ20 మాడల్స్‌ను, టాప్ రేంజ్‌ సెగ్మెంట్‌లో ఎక్స్10, ఎక్స్20లను విడుదల చేసింది. సీ10, సీ20లు ఆండ్రాయిడ్ 11(గో ఎడిషన్)ను ఆఫర్ చేస్తుండగా, జీ10, జీ20, ఎక్స్10, ఎక్స్20లు రెగ్యులర్ ఆండ్రాయిడ్ 11 ఎక్స్‌పీరియన్స్ ఆఫర్ చేస్తూ 5జీ కనెక్టివిటీ ఫీచర్‌తో వస్తున్నాయి. సీ సెగ్మెంట్ ఫోన్‌లు జూన్ నుంచి జీ సెగ్మెంట్ ఫోన్‌లు, ఏప్రిల్ చివరలో, ఎక్స్ సెగ్మెంట్ ఫోన్‌లు మేలో అంతర్జాతీయ మార్కెట్‌లలో అందుబాటులోకి రానున్నాయి.

డ్యుయల్ సిమ్(నానో), 6.51 ఇంచుల స్క్రీన్‌తో నోకియా సీ10 ధర రూ. 7000(సుమారు)లతో మొదవనుంది. ఇందులో బేస్ మాడల్ 1జీబీ ర్యామ్ + 16 జీబీ వేరియంట్ కలిగి ఉంటాయి. జీ 10 సెగ్మెంట్(బేస్ మాడల్ 3 జీబీ ర్యామ్+ 32 జీబీ ఎక్స్‌పాండబుల్) సుమారు ధర రూ. 12,300తో మొదలవనుంది. 6.5 ఇంచుల స్క్రీన్, 13 మెగా పిక్సెల్స్‌తో మూడు వెనుకవైపు కెమెరాలు, 8 మెగా పిక్సెల్స్ సెల్ఫీ కెమరాలతో అందుబాటులోకి రానున్న జీ 10 ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో జీ 25 ప్రాసెసర్‌ను కలిగి ఉండనుంది. నోకియా ఎక్స్ సెగ్మెంట్(బేస్ మాడల్ 6జీబీ ర్యామ్ + 64 జీబీ ఎక్స్‌పాండబుల్) ధర రూ. 27,400 నుంచి రూ. 31,000ల మధ్యలో ఉంటుంది. 6.67 ఇంచుల స్క్రీన్‌తో వెనుకవైపు నాలుగు కెమెరాలు జీయిస్ ఆప్టిక్, 48 ఎంపీ ప్రైమరీ సెన్సార్ ఫీచర్‌తో రానున్నాయి. ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్ కలిగి ఉంటుంది.

Tags:    

Similar News