‘నో రిఫరెన్స్ పాయింట్’ కొవిడ్‌పై విజయం

దిశ, న్యూస్‌బ్యూరో: అంతర్జాతీయ కీలక వక్త, కార్పొరేట్ శిక్షకుడు జేవీసీ శ్రీరామ్ రాసిన ‘నో రిఫరెన్స్ పాయింట్’ పుస్తకాన్ని బుధవారం డిజిటల్ కార్యక్రమంలో ఆవిష్కరించారు. కొవిడ్ ప్రభావం పరిశ్రమలపై పడినా, కొన్నిమాత్రం ఈ సంక్షోభం నుంచి బయటపడిన తీరును, జీవితంలోని వివిధ అంశాలను, వాణిజ్యం తీరును ఈ పుస్తకం వివరిస్తుంది. ఈ సందర్భంగా రచయిత జేవీసీ శ్రీరామ్ మాట్లాడుతూ ఇలాంటి పరిస్థితిని మనం ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదని, ప్రపంచ వ్యాప్తంగా మానవాళిని అతలాకుతలం చేస్తున్న సంక్షోభం నుంచి […]

Update: 2020-08-26 07:19 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: అంతర్జాతీయ కీలక వక్త, కార్పొరేట్ శిక్షకుడు జేవీసీ శ్రీరామ్ రాసిన ‘నో రిఫరెన్స్ పాయింట్’ పుస్తకాన్ని బుధవారం డిజిటల్ కార్యక్రమంలో ఆవిష్కరించారు. కొవిడ్ ప్రభావం పరిశ్రమలపై పడినా, కొన్నిమాత్రం ఈ సంక్షోభం నుంచి బయటపడిన తీరును, జీవితంలోని వివిధ అంశాలను, వాణిజ్యం తీరును ఈ పుస్తకం వివరిస్తుంది. ఈ సందర్భంగా రచయిత జేవీసీ శ్రీరామ్ మాట్లాడుతూ ఇలాంటి పరిస్థితిని మనం ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదని, ప్రపంచ వ్యాప్తంగా మానవాళిని అతలాకుతలం చేస్తున్న సంక్షోభం నుంచి బయటపడేందుకు మార్గాలు వెతుకుతున్నాయన్నారు. ఈ పరిస్థితిలోనే మనుషులంతా బతకాల్సి ఉంటుంది. కానీ ఇలాంటి సమయంలోనే మనం మేలుకొని, విజయవంతంగా ఎదగడం అవసరం. ఈ సమస్యాత్మక సమయంలోనూ కొత్త ఎత్తులు చూసి, విజయాలు సాధించిన వివిధ వ్యక్తుల జీవితాలను ‘నో రిఫరెన్స్ పాయింట్’ ఆవిష్కరిస్తుంది’’ అని తెలిపారు.

ఈ పుస్తకంపై మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ‘కొవిడ్ 19 మహమ్మారి క్రీడారంగం సహా మానవ జీవితంలోని అన్ని రంగాలనూ తీవ్రంగా దెబ్బతీసింది. జేవీసీ శ్రీరామ్ చేసిన పరిశోధన, ఆయన తీసుకున్న ఉదాహరణలు చాలా బాగున్నాయి. మధ్యలో చెప్పిన పిట్టకథలు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ కష్టకాలంలో విజయం సాధించడానికి ఈ పుస్తకం తప్పక చదవాలి’’ అన్నారు. పుస్తకంలో మూడు భాగాలున్నాయి. మొదటి భాగంలో వుకా ప్రపంచ లక్షణాలు, మార్పు, మార్పు ప్రభావం గురించి ఉంటుంది. రెండో భాగంలో మన రోజువారీ జీవితంలో మార్పులు చేసుకోవడం, కొన్ని సంస్థలు పాటిస్తున్న మంచి అలవాట్లు ఉంటాయి. ఇక చివరి భాగం పలువురు పరిశ్రమల యజమానులు, సీఈవోలు, డాక్టర్లు, పారిశ్రామిక సలహాదారులు, ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు, పరిశ్రమల అధినేతలతో రచయిత జరిపిన సంభాషణల సంగ్రహం ఉంటుందన్నారు.

Tags:    

Similar News