పోలీస్ స్టేషన్లలో పెన్నులకు కూడా పైసల్ లేవంట!

దిశ ప్రతినిధి, మేడ్చల్: ఆర్టీసీ కార్మికుల సమ్మె కాలంలో నిరసనలను అడ్డుకోవడం, లాక్‌డౌన్ నిబంధనలు అమలు చేయడంలో కీలక పాత్ర పోషించిన పోలీసులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. 9 నెలలుగా పోలీసు స్టేషన్ల మెయింటెనెన్స్ ఖర్చులు విడుదల చేయడం లేదు. దీంతో పెన్నులు, పేపర్లు, కనీస సౌకర్యాల ఏర్పాటులో ఏం చేయాలో తెలీక స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు తలలు పట్టుకుంటున్నారు. 2019, ఆక్టోబర్ నెలకు ముందు వరకు తెలంగాణ సర్కారు ఒక్కో లా అండ్ ఆర్డర్ పోలీస్ […]

Update: 2020-06-18 20:02 GMT

దిశ ప్రతినిధి, మేడ్చల్: ఆర్టీసీ కార్మికుల సమ్మె కాలంలో నిరసనలను అడ్డుకోవడం, లాక్‌డౌన్ నిబంధనలు అమలు చేయడంలో కీలక పాత్ర పోషించిన పోలీసులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. 9 నెలలుగా పోలీసు స్టేషన్ల మెయింటెనెన్స్ ఖర్చులు విడుదల చేయడం లేదు. దీంతో పెన్నులు, పేపర్లు, కనీస సౌకర్యాల ఏర్పాటులో ఏం చేయాలో తెలీక స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు తలలు పట్టుకుంటున్నారు. 2019, ఆక్టోబర్ నెలకు ముందు వరకు తెలంగాణ సర్కారు ఒక్కో లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్‌కు నిర్వహణ ఖర్చుల నిమిత్తం రూ.75 వేలు, అదే‌విధంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు నెలకు ఒక్కో ఠాణాకు రూ.50వేలు చెల్లించేది. కానీ గత 9 నెలలుగా ఒక్కపైసా కూడా రాష్ట్ర సర్కారు విడుదల చేయలేదు.

కష్టంగా నిర్వహణ..

పోలీసు స్టేషన్ల మెయింటెనెస్స్‌కు డబ్బులు రాకపోవడంతో కొన్ని పోలీసు స్టేషన్లలో మంచినీళ్లు కూడా ఉండడం లేదు. శాంతిభద్రతల స్టేషన్లకు రూ.75 వేలు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు రూ.50 వేల చొప్పున నిర్వహణ ఖర్చులను ప్రభుత్వం చెల్లిస్తూ వస్తోంది. దీంతో పోలీస్ స్టేషన్లలో కలెక్టర్ల వ్యవస్థ పోయింది. ప్రజలకు, వ్యాపారస్థులకు మామూళ్ల బాధ తప్పింది. ప్రభుత్వం ఈ డబ్బులను నిలిపి వేయడంతో స్టేషన్లలో నిర్వహణ లేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పలు కేసుల్లో అరెస్ట్ అయిన నింధితులకు భోజనాలు పెట్టించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. టాయిలెట్ల నిర్వహణ ఇబ్బందిగా తయారైంది. కోర్టులకు నిందితులను తీసుకువెళ్లడానికి కూడా డబ్బులు లేవని పలువురు కోర్టు డ్యూటీ పోలీసులు వాపోతున్నారు.

మామూళ్లకు అస్కారం..

పోలీస్ స్టేషన్లకు నిర్వహణ ఖర్చులు విడుదల చేయకపోవడంతో మామూళ్లు వసూలు చేసే అవకాశం ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పలు స్టేషన్ల పరిధిలలో మద్యం దుకాణాలు, హోటళ్లు, వ్యాపార సంస్థల వద్ద నుంచికు గుట్టు చప్పుడు కాకుండా మామూళ్లు వసూలవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికైనా స్టేషన్ నిర్వహణ ఖర్చులను చేల్లించాలని ఎస్ హెచ్ ఓలోలు కోరుతున్నారు.

Tags:    

Similar News