పార్టీ వ్యతిరేకులపై చర్యలు తప్పవు : రేవంత్

దిశ,తెలంగాణ బ్యూరో : మనం కూర్చున్న కొమ్మను మనం నరుక్కోవద్దని పార్టీకి వ్యతిరేకంగా నాతో సహా ఎవరు పని చేసినా చర్యలు తీసుకోవాల్సిందేనని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీలో బాధ్యతాయుతంగా పనులు చేస్తేనే గౌరవం పెరుగుతుందని పేర్కొన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికల సమీక్ష సమావేశం అనంతరం ఈ నెల 9న జరిగే ఇంద్రవెల్లి సభ పోస్టర్ విడుదల చేసి బుధవారం ఆయన మాట్లాడారు. పార్టీ సమిష్టి నిర్ణయం మేరకే అన్ని పనులు జరుగుతాయని, నాయకుల […]

Update: 2021-08-04 11:44 GMT

దిశ,తెలంగాణ బ్యూరో : మనం కూర్చున్న కొమ్మను మనం నరుక్కోవద్దని పార్టీకి వ్యతిరేకంగా నాతో సహా ఎవరు పని చేసినా చర్యలు తీసుకోవాల్సిందేనని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీలో బాధ్యతాయుతంగా పనులు చేస్తేనే గౌరవం పెరుగుతుందని పేర్కొన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికల సమీక్ష సమావేశం అనంతరం ఈ నెల 9న జరిగే ఇంద్రవెల్లి సభ పోస్టర్ విడుదల చేసి బుధవారం ఆయన మాట్లాడారు.

పార్టీ సమిష్టి నిర్ణయం మేరకే అన్ని పనులు జరుగుతాయని, నాయకుల సూచనల మేరకే నిర్ణయాలు తీసుకుంటారని స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో అందరూ కలిసికట్టుగా సమష్టిగా పనిచేయాలని సూచించారు. ఆగస్టు 9న ఇంద్రవెళ్లిలో జరిగే దళిత,గిరిజన దండోరా కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా కృషిచేయాలని సూచించారు. ఆగస్టు 11 నుంచి 21 వరకూ పదిరోజుల పాటు 5 మండలాలు, 2 మున్సిపాలిటీల్లో ప్రతి రోజూ 3వేల మందితో ర్యాలీలు, సమావేశాలు జరపే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని తెలపారు.

గిరిజనుల కష్టాలను ప్రభుత్వం గుర్తించడం లేదని, హుజూరాబాద్ ఎన్నికల్లో దళితుల ఓట్లు కొనుగోలు చేసేందుకు కేసీఆర్ ఇంటికి పది లక్షలు ప్రకటించారని ఎద్దేవాచేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనుల నుంచి భూమిని లాక్కోవడమే తప్ప ఇచ్చిందేమీ లేదని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. గిరిజనుల చిచ్చు పెట్టి టీఆర్ఎస్ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గిరిజనుల సమస్య పరిష్కారం అవుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర్ రాజా నర్సింహ, వర్కింగ్ ప్రెసిడెంట్స్ గీతారెడ్డి, జగ్గారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, ముఖ్య నాయకులు పొన్నం ప్రభాకర్, బలరాం నాయక్, వేం నరేందర్ రెడ్డి, చిన్నారెడ్డిలతో పాటు హుజురాబాద్ ఎన్నికల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Tags:    

Similar News