ఓన్లీ ఫోర్ హవర్స్..జిల్లా పరిషత్ మీట్ ఓవర్
దిశ,నిజామాబాద్ : కరోనా ఎఫెక్ట్ వలన ఇన్ని రోజులు ఆలస్యమైనా జిల్లా పరిషత్ సమావేశం బుధవారం ప్రారంభమైంది.నిజామాబాద్‌లోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన మీట్ కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే ముగిసింది. జిల్లా ప్రజా పరిషత్ మూడో సాధారణ సర్వసభ్య సమావేశం చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు అధ్యక్షతన జరిగింది.ఇందులోజిల్లాకు చెందిన మంత్రితో పాటు ఐదుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు, ఎమ్మెల్సీలు హజరు కాకున్నా కోరం ఉండటంతో ఉధయం 11.30 లకు ప్రారంభించి సాయంత్రం 4 […]
దిశ,నిజామాబాద్ : కరోనా ఎఫెక్ట్ వలన ఇన్ని రోజులు ఆలస్యమైనా జిల్లా పరిషత్ సమావేశం బుధవారం ప్రారంభమైంది.నిజామాబాద్‌లోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన మీట్ కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే ముగిసింది. జిల్లా ప్రజా పరిషత్ మూడో సాధారణ సర్వసభ్య సమావేశం చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు అధ్యక్షతన జరిగింది.ఇందులోజిల్లాకు చెందిన మంత్రితో పాటు ఐదుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు, ఎమ్మెల్సీలు హజరు కాకున్నా కోరం ఉండటంతో ఉధయం 11.30 లకు ప్రారంభించి సాయంత్రం 4 గంటల్లో పూర్తయింది.కీలక శాఖలపై ప్రజా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు అధికారులు జవాబులు చెప్పారు. సభాధ్యక్షులు మాట్లాడుతూ..కరోనా వల్ల సర్వసభ్య సమావేశం నిర్వహించడం ఆలస్యం అయ్యిందని, రాష్ట్రంలో అత్యధికంగా 61 కేసులు నమోదై జిల్లా రెండోస్థానంలో నిలిచిందన్నారు. అతి తక్కువ సమయంలో కరోనాను కట్టడి చేసి, సకాలంలో ధాన్యం సేకరణ పూర్తి చేసిన జిల్లా కలెక్టర్, యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు.
జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ..ప్రభుత్వం తీసుకున్న చర్యలవల్ల కరోనా కట్టడి చేయగలిగామని, ఇప్పుడు లాక్‌డౌన్‌ను సడలించడం, అంతర్రాష్ట్ర ప్రయాణాలను అనుమతించడం, పైగా వర్షాకాలం ప్రారంభమైనందున సాధారణంగా వచ్చే దగ్గు, జలుబు వంటి జబ్బులవల్ల కరోనా త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. నవంబర్-డిసెంబర్ వరకు వాక్సిన్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నందున ప్రతి ఒక్కరూ మరింత అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు, శానిటైజర్లు వాడుతూ, భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. ముఖ్యంగా వేరే రాష్ట్రాల నుంచి ఇప్పటి వరకు 6,500 మంది జిల్లాకు వచ్చారని, అందులో 2,700మంది కరోనా ఎక్కువగా వున్న మహారాష్ట్ర నుంచి వచ్చారన్నారు. ప్రజలను కాపాడే బాధ్యత అధికారులు, ప్రజా ప్రతినిధులందరిదనీ ఆయన వివరించారు.
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ మాట్లాడుతూ.. దొడ్డు వరి రకాలు డిమాండుకు మించి పండుతున్నందున, వానాకాలం పంట ప్రణాళికలో భాగంగా జిల్లాలో సన్నవరి రకాలు రెట్టింపు విస్తీర్ణంలో పండించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. అలాగే మొక్కజొన్న అవసరానికి మించి నిలువ ఉన్నందున మొక్కజొన్నకు బదులుగా ఇతర ప్రత్యామ్నాయ పంటలు వేయాలన్నారు. రైతు భీమా పథకం కింద 2018-19 సంవత్సరంలో 703 మంది రైతులు చనిపోగా 698 మందికి 34.90 కోట్లు, 2019-20 సంవత్సరంలో 512 మంది రైతులు చనిపోగా 448 మందికి 22.40 కోట్లు మంజూరు చేశామన్నారు. సమావేశానికి ఎమ్మెల్సీలు వి.జి.గౌడ్, ఆకుల లలిత, అదనపు కలెక్టర్ బి.ఎస్ లత, డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ మోహన్ రెడ్డి, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.