బిగ్ బ్రేకింగ్ : ఏసీబీ వలలో నిజామాబాద్ జిల్లా DMHO AO.. పక్కాగా స్కెచ్ గీసి..!
దిశప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా వైద్యారోగ్యశాఖ అడ్మినిస్ర్టేటివ్ అధికారి శోభన్ బాబు రూ.15వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడ్డాడు. సోమవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ అంజనకు సంబంధించిన వాహన డ్రైవర్ సమీర్ హైమద్ నుంచి లంచం తీసుకుంటుండగా శోభర్ బాబును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. డిప్యూటీ డీఎంహెచ్ఓకు సంబంధించిన వాహనం అద్దె 8 నెలలుగా పెండింగ్‌లో ఉంది. ఆ మొత్తాన్ని చెల్లించాలని డ్రైవర్ సమీర్ హైమద్ డీఎంహెచ్ఓ ఏవోను కోరడంతో […]
దిశప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా వైద్యారోగ్యశాఖ అడ్మినిస్ర్టేటివ్ అధికారి శోభన్ బాబు రూ.15వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడ్డాడు. సోమవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ అంజనకు సంబంధించిన వాహన డ్రైవర్ సమీర్ హైమద్ నుంచి లంచం తీసుకుంటుండగా శోభర్ బాబును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. డిప్యూటీ డీఎంహెచ్ఓకు సంబంధించిన వాహనం అద్దె 8 నెలలుగా పెండింగ్‌లో ఉంది.
ఆ మొత్తాన్ని చెల్లించాలని డ్రైవర్ సమీర్ హైమద్ డీఎంహెచ్ఓ ఏవోను కోరడంతో అందుకు ప్రతిఫలంగా లంచం ఇవ్వాలని ఆ అధికారి కోరాడు. దీంతో వాహనం డ్రైవర్ కమ్ ఓనర్ సమీర్ హైమద్ ఏసీబీని ఆశ్రయించాడు. ఈ క్రమంలోనే పక్కా ప్రణాళికతో హైమద్ నుంచి లంచం తీసుకుంటుండగా డీఎంహెచ్‌ఓ ఏవో శోభన్ బాబును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నిజామాబాద్ కలెక్టరేట్‌ను ఆనుకుని ఉన్న వైద్యఆరోగ్యశాఖలో లంచం తీసుకుంటూ అధికారి పట్టుబడిన ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. ఏసీబీ అధికారుల ఎంట్రీతో తోటి అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయని చెప్పవచ్చు.