నిత్య ఫస్ట్ సిరీస్ అలా మొదలైంది..

‘అలా మొదలైంది..’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ నిత్యా మీనన్.. ఒక్క సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించింది. ఇష్క్ సినిమాతో యూత్‌ను అట్రాక్ట్ చేసిన ఈ మళయాళీ భామ.. ‘గుండె జారి గల్లంతయ్యిందే’తో ఫిదా చేసేసింది. కానీ ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీపై అంతగా కాన్సంట్రేట్ చేయలేదు. చివరగా బాలీవుడ్ ‘మిషన్ మంగళ్’ సినిమాలో కనిపించిన నిత్య.. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లపై దృష్టి పెట్టిందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. వాటిని నిజం చేస్తూ తన […]

Update: 2020-06-12 05:31 GMT

‘అలా మొదలైంది..’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ నిత్యా మీనన్.. ఒక్క సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించింది. ఇష్క్ సినిమాతో యూత్‌ను అట్రాక్ట్ చేసిన ఈ మళయాళీ భామ.. ‘గుండె జారి గల్లంతయ్యిందే’తో ఫిదా చేసేసింది. కానీ ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీపై అంతగా కాన్సంట్రేట్ చేయలేదు. చివరగా బాలీవుడ్ ‘మిషన్ మంగళ్’ సినిమాలో కనిపించిన నిత్య.. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లపై దృష్టి పెట్టిందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. వాటిని నిజం చేస్తూ తన తొలి వెబ్ సిరీస్ ఫస్ట్‌ లుక్ రిలీజ్ చేసింది. ‘బ్రీత్ ఇన్ టు ద షాడోస్’ పేరుతో వస్తున్న సిరీస్ ఫస్ట్ లుక్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. పగిలిపోయిన మాస్క్ ముక్కల నడుమ చిన్నారి పడుకుని ఉన్న పోస్టర్ ఆసక్తి రేపుతోంది. నీడలో పడుకుని ఉంటూ.. ఏదో దొరుకుతుందని ఎదురుచూస్తోందనే క్యాప్షన్‌తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన నిత్య.. జులై 10న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలిపింది.

https://www.instagram.com/p/CBU6saUl6pR/?igshid=1bgowcd9960qp

మాధవన్ నటించిన ‘బ్రీత్ వెబ్ సిరీస్’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సిరీస్‌లో అభిషేక్ బచ్చన్ కీలక పాత్ర చేస్తున్నాడు. కాగా మయాంక్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్‌ను అబండెన్షియా ఎంటర్‌టైన్మెంట్ సంస్థ నిర్మించింది.

Tags:    

Similar News