నిహారిక పెళ్లి సందడి షురూ..

దిశ, వెబ్‌డెస్క్: మెగా డాటర్ నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ చైతన్య పెళ్లికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. మరో ఆరు రోజుల్లో మూడుముళ్ల బంధంతో ఇద్దరూ ఒక్కటి కానుండగా.. అల్లు, మెగా ఫ్యామిలీ ఇప్పటికే రాజస్థాన్‌(ఉదయ్‌పూర్)కు చేరుకుని సెలెబ్రేషన్స్ స్టార్ట్ చేశారు. బుధవారం రాత్రి పెళ్లి సందడి షురూ కాగా మెగా, అల్లు కజిన్స్ ఒక్కచోట చేరి సూపర్‌గా ఎంజాయ్ చేశారు. ఈ బ్యాచ్‌లో వరుణ్, తేజ్, అల్లు శిరీష్, బన్నీ వాసు, అల్లు అర్జున్ వైఫ్ స్నేహ, […]

Update: 2020-12-03 00:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: మెగా డాటర్ నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ చైతన్య పెళ్లికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. మరో ఆరు రోజుల్లో మూడుముళ్ల బంధంతో ఇద్దరూ ఒక్కటి కానుండగా.. అల్లు, మెగా ఫ్యామిలీ ఇప్పటికే రాజస్థాన్‌(ఉదయ్‌పూర్)కు చేరుకుని సెలెబ్రేషన్స్ స్టార్ట్ చేశారు. బుధవారం రాత్రి పెళ్లి సందడి షురూ కాగా మెగా, అల్లు కజిన్స్ ఒక్కచోట చేరి సూపర్‌గా ఎంజాయ్ చేశారు. ఈ బ్యాచ్‌లో వరుణ్, తేజ్, అల్లు శిరీష్, బన్నీ వాసు, అల్లు అర్జున్ వైఫ్ స్నేహ, సుస్మిత, శ్రీజ, కళ్యాణ్ దేవ్‌తో పాటు వధూవరులు ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయింది. కాగా ఉదయ్‌పూర్‌లోని ఉదయ్ విలాస్‌లో డిసెంబర్ 9న రా.7:30 నిమిషాలకు నిహారిక-చైత్యన్య(నిశ్చయ్) వివాహం జరగనుండగా.. డిసెంబర్ 11న హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ హాల్‌లో రిసెప్షన్‌ను ప్లాన్ చేసింది మెగా ఫ్యామిలీ.

Tags:    

Similar News