సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్‌లో నిర్మల్ ప్రొఫెసర్

       తమిళనాడులోని చిదంబరంలో జరిగిన అన్నమలై యూనివర్సిటీ 40వ సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్‌కు నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ పి జి రెడ్డి హాజరయ్యారు. ఈ నెల ఒకటో తేది నుంచి జరుగుతున్న జాతీయ స్థాయి సదస్సుకు నిర్మల్‌కు చెందిన ప్రొఫెసర్ పిజి రెడ్డి ఎంపికవడం గమనార్హం. భారతదేశంలో అనాదిగా వస్తున్న వ్యాపార దృక్పథం‌పై ఆయన తన పరిశోధనాత్మక నివేదికను సమర్పించారు. హరప్పా మొహంజోదారో కాలం నాటి నుంచి […]

Update: 2020-02-04 22:13 GMT

మిళనాడులోని చిదంబరంలో జరిగిన అన్నమలై యూనివర్సిటీ 40వ సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్‌కు నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ పి జి రెడ్డి హాజరయ్యారు. ఈ నెల ఒకటో తేది నుంచి జరుగుతున్న జాతీయ స్థాయి సదస్సుకు నిర్మల్‌కు చెందిన ప్రొఫెసర్ పిజి రెడ్డి ఎంపికవడం గమనార్హం. భారతదేశంలో అనాదిగా వస్తున్న వ్యాపార దృక్పథం‌పై ఆయన తన పరిశోధనాత్మక నివేదికను సమర్పించారు. హరప్పా మొహంజోదారో కాలం నాటి నుంచి శాతవాహనులు, కాకతీయుల పాలన వరకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సాగించిన వ్యాపార వ్యవహారాలపై ఆయన ఈ సదస్సులో ప్రసంగించారు. అప్పట్లోనే సముద్రమార్గం గుండా సరుకు రవాణా ఎగుమతులు, దిగుమతుల‌తో పాటు కాలానుగతంగా వ్యాపారంలో వచ్చిన మార్పుల‌పై ఆయన సమర్పించిన పరిశోధన పత్రానికి సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ మంచి గుర్తింపు లభించింది. సదస్సుకు హాజరైన పిజి రెడ్డిని ఈ సందర్భంగా జిల్లా వాసులు అభినందించారు.

Tags:    

Similar News