ప్రజలు బయటికి రాకుండా చూడాలి: కలెక్టర్ ఫారూఖీ

దిశ, ఆదిలాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కంటైన్మెంట్ జోన్ల నుంచి ప్రజలు బయటకు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ ఆదేశించారు. శనివారం ప్రత్యేక అధికారులతో కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 19 కరోనా కేసులు నమోదైనట్టు చెప్పారు. వైరస్ వ్యాప్తి నిరోధానికి 14 ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ఏర్పాటు చేశామని తెలిపారు. నిత్యావసర వస్తువులు, కూరగాయలను నేరుగా ఇంటికే అందజేయనున్నట్టు చెప్పారు. కేంద్ర […]

Update: 2020-04-18 09:51 GMT

దిశ, ఆదిలాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కంటైన్మెంట్ జోన్ల నుంచి ప్రజలు బయటకు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ ఆదేశించారు. శనివారం ప్రత్యేక అధికారులతో కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 19 కరోనా కేసులు నమోదైనట్టు చెప్పారు. వైరస్ వ్యాప్తి నిరోధానికి 14 ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ఏర్పాటు చేశామని తెలిపారు. నిత్యావసర వస్తువులు, కూరగాయలను నేరుగా ఇంటికే అందజేయనున్నట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిర్మల్ జిల్లాను రెడ్‌జోన్‌గా ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు బయటకు వెళ్ళకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని రోడ్లను దిగ్బంధం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్పీ శశిధర్‌రాజు, జిల్లా అదనపు కలెక్టర్ ఎ. భాస్కర్ రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వసంత్ రావు, జిల్లా ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: Nirmal collector,Musharraf Pharukhi, special officers

Tags:    

Similar News