పంజాబ్‌లో 15 రోజులు నైట్ కర్ఫ్యూ

చండీగఢ్: కరోనా మహమ్మారి సెకండ్ వేవ్‌ను అరికట్టే ప్రణాళికలో భాగంగా పంజాబ్ ప్రభుత్వం పలు కట్టడి చర్యలను ప్రకటించింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో నైట్ కర్ఫ్యూ అమలు చేసే నిర్ణయాన్ని కెప్టెన్ అమరీందర్ ప్రభుత్వం వెల్లడించింది. రాత్రి పదింటి నుంచి ఉదయం ఐదింటి వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. మాస్కు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించండం, ఇతర కరోనా నిబంధనలు ఉల్లంఘించినవారిపై […]

Update: 2020-11-25 05:07 GMT

చండీగఢ్: కరోనా మహమ్మారి సెకండ్ వేవ్‌ను అరికట్టే ప్రణాళికలో భాగంగా పంజాబ్ ప్రభుత్వం పలు కట్టడి చర్యలను ప్రకటించింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో నైట్ కర్ఫ్యూ అమలు చేసే నిర్ణయాన్ని కెప్టెన్ అమరీందర్ ప్రభుత్వం వెల్లడించింది. రాత్రి పదింటి నుంచి ఉదయం ఐదింటి వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.

మాస్కు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించండం, ఇతర కరోనా నిబంధనలు ఉల్లంఘించినవారిపై జరిమానాను రెట్టింపు చేసినట్టు తెలిపింది. ప్రస్తుతమున్న ఫైన్ రూ. 500ను వెయ్యికి పెంచినట్టు వివరించింది. రెస్టారెంట్లు, వివాహ వేదికలు రాత్రి 9.30గంటల్లోపు మూసేయాలని ఆదేశించింది. చికిత్స కోసం ఢిల్లీ నుంచి కరోనా పేషెంట్లు రాష్ట్రంలోకి పోటెత్తుతున్నందున ప్రైవేట్ హాస్పిటల్స్‌లోనూ ఆక్సిజన్, ఐసీయూ బెడ్లను అందుబాటుపై పరిశీలనలు చేయాలని ఉన్నతస్థాయి కొవిడ్ రివ్యూ మీటింగ్‌లో నిర్ణయం జరిగినట్టు అధికారులు తెలిపారు.

Tags:    

Similar News