మధ్యప్రదేశ్‌లో నైట్ కర్ఫ్యూ

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా విజృంభిస్తోంది. కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్ లేదా రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నాయి. ఇప్పటికే కేసులు పెరుగుతుండటంతో.. మహారాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించగా.. తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న భోపాల్, ఇండోర్‌లో మార్చి 17 నుంచి రాత్రి కర్ఫ్యూ విధించనున్నట్లు  ప్రకటించింది. తర్వాతి ఉత్తర్వులు వచ్చే వరకు రాత్రి […]

Update: 2021-03-16 05:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా విజృంభిస్తోంది. కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్ లేదా రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నాయి. ఇప్పటికే కేసులు పెరుగుతుండటంతో.. మహారాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించగా.. తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న భోపాల్, ఇండోర్‌లో మార్చి 17 నుంచి రాత్రి కర్ఫ్యూ విధించనున్నట్లు ప్రకటించింది. తర్వాతి ఉత్తర్వులు వచ్చే వరకు రాత్రి కర్ఫ్యూ అమలవుతుందని ప్రకటించింది. రాత్రి 10 నుంచి ఉదయం వరకు కర్ఫ్యూ అమలు చేస్తామని, అత్యవసర సేవలు మినహా మిగతావన్నీ మూసివేసి ఉంటాయంది.

Tags:    

Similar News