లాల్‌సలాం, కామ్రేడ్ పదాలను పలికారు: ఎన్ఐఏ
న్యూఢిల్లీ: రష్యా కమ్యూనిస్టు నేత వ్లాదిమిర్ లెనిన్ ఫొటో వినియోగించారని, లాల్‌సలాం, కామ్రేడ్ పదాలను పలికారన్న ఆధారాలు చూపెడుతూ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) ఓ యాక్టివిస్టును మావోయిస్టుగా అభియోగాలు మోపింది. అసోంలో రైతు సమస్యలపై పోరాడే అఖిల్ గొగోయ్ సన్నిహితుడు బిట్టు సోనోవాల్‌పై ఈ అభియోగాలు దాఖలయ్యాయి. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అసోంలో ఆందోళనలు పెల్లుబికిన తరుణంలో అఖిల్ గొగోయ్, మరో ఇద్దరు అతని సన్నిహితులతోపాటు బిట్టు సోనోవాల్ ఈ ఏడాది తొలినాళ్లలో అరెస్టయ్యారు. వీరిపై […]
న్యూఢిల్లీ: రష్యా కమ్యూనిస్టు నేత వ్లాదిమిర్ లెనిన్ ఫొటో వినియోగించారని, లాల్‌సలాం, కామ్రేడ్ పదాలను పలికారన్న ఆధారాలు చూపెడుతూ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) ఓ యాక్టివిస్టును మావోయిస్టుగా అభియోగాలు మోపింది. అసోంలో రైతు సమస్యలపై పోరాడే అఖిల్ గొగోయ్ సన్నిహితుడు బిట్టు సోనోవాల్‌పై ఈ అభియోగాలు దాఖలయ్యాయి. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అసోంలో ఆందోళనలు పెల్లుబికిన తరుణంలో అఖిల్ గొగోయ్, మరో ఇద్దరు అతని సన్నిహితులతోపాటు బిట్టు సోనోవాల్ ఈ ఏడాది తొలినాళ్లలో అరెస్టయ్యారు. వీరిపై మే 29న ఎన్ఐఏ ఉపా అభియోగాల కింద చార్జిషీటు దాఖలు చేసింది. ఫేస్‌బుక్‌లో వ్లాదిమిర్ లెనిన్ ఫొటోను సోనోవాల్ అప్‌లోడ్ చేశారని, తన మిత్రులను లాల్‌సలాం అని పలకరిస్తూ ‘కామ్రేడ్’లుగా వ్యవహరించేవాడని ఆ చార్జిషీటులో పేర్కొంది. క్రిషక్ ముక్తి సంగ్రామ్ సమితి(కేఎంఎస్ఎస్)తో పనిచేస్తున్న అఖిల్ గొగోయ్ డిసెంబర్ 12న అరెస్టు కాగా, అతనిపై ఐపీసీలోని సెక్షన్‌లు, 120బీ, 253ఏ, 153బీ సహా ఉపాలోని సెక్షన్‌లు 18, 39 కింద అభియోగాలు దాఖలయ్యాయి. అయినప్పటికీ అఖిల్ గొగోయ్‌కు ఓ కోర్టు బెయిలు మంజూరు చేసినా మరికొన్ని కేసులు దాఖలు చేసి పోలీసులు విడుదల చేయలేదని ఆరోపణలు వచ్చాయి. తమ నాయకులను మావోయిస్టులుగా చిత్రించాలని ఎన్ఐఏ తీవ్రప్రయత్నాలు చేస్తున్నదని కేఎంఎస్ఎస్ అధ్యక్షుడు బాస్కో సైకియా ఆరోపించారు.