అనుష్క పెళ్లి నిజమేనా..?

దిశ, వెబ్ డెస్క్: దశాబ్దంన్నరగా తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రస్థాయి నటీమణిగా చెలమణి అవుతున్న హీరోయిన్ అనుష్క. తన అందం, అభినయంతో అభిమానులతోపాటు కుర్రకారును ఇట్టే ఆకట్టుకుంది ఆమె. ఆమెకు ఏజ్ పెరిగినా.. పోటీగా కుర్ర హీరోయిన్స్ వచ్చినా ఆమె క్రేజ్ మాత్రం చిత్రసీమలో ఏమాత్రం తగ్గడం లేదు. అనుష్క సినిమా అంటే సంవత్సాల తరబడి కూడా అభిమానులు ఎదురు చూస్తున్నారు. అందాల నటి అనుష్క గురించి ఓ చేదు వార్త ఆమె అభిమానులను కలవర పెడుతోంది. […]

Update: 2020-07-13 06:41 GMT

దిశ, వెబ్ డెస్క్: దశాబ్దంన్నరగా తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రస్థాయి నటీమణిగా చెలమణి అవుతున్న హీరోయిన్ అనుష్క. తన అందం, అభినయంతో అభిమానులతోపాటు కుర్రకారును ఇట్టే ఆకట్టుకుంది ఆమె. ఆమెకు ఏజ్ పెరిగినా.. పోటీగా కుర్ర హీరోయిన్స్ వచ్చినా ఆమె క్రేజ్ మాత్రం చిత్రసీమలో ఏమాత్రం తగ్గడం లేదు. అనుష్క సినిమా అంటే సంవత్సాల తరబడి కూడా అభిమానులు ఎదురు చూస్తున్నారు.

అందాల నటి అనుష్క గురించి ఓ చేదు వార్త ఆమె అభిమానులను కలవర పెడుతోంది. ఆమె చిత్ర పరిశ్రమకు గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతోంది. అనుష్క తన యాక్టింగ్ కెరీర్‌కు ఫులిస్టాఫ్ పెట్టి పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. పెళ్లి తర్వాత కేవలం గృహిణిగానే ఉండాలని ఆమె ప్లాన్ చేసుకుంటున్నట్లు ఆ వార్త సోసల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ వార్త నిజమా.. కాదా అనే దానిపై క్లారిటీ రావాలంటే అనుష్క స్పందించాల్సిన అవసరం ఉన్నది.

Tags:    

Similar News