విషాదం.. పెళ్లైన 4 రోజులకే భార్యాభర్తలు మృతి

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి చేసుకున్న 4 రోజులకే నూతన దంపతులు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని అరక్కోణానికి చెందిన మనోజ్ కుమార్ (31), తాంబరం పెరుంగళత్తూరుకు చెందిన కార్తీక(30)తో అక్టోబర్ 28న పెళ్లి జరిగింది. ఈ నూతన దంపతులు కారులో సోమవారం ఉదయం పెరుంగళత్తూరు నుంచి అరక్కోణం బయలుదేరారు. కూవం వద్దకు రాగానే అటువైపు నుంచి వస్తున్న ఓ సిమెంట్ ట్యాంకర్ అదుపు తప్పి వీరు ప్రయాణిస్తున్న కారుపై […]

Update: 2021-11-01 21:33 GMT

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి చేసుకున్న 4 రోజులకే నూతన దంపతులు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని అరక్కోణానికి చెందిన మనోజ్ కుమార్ (31), తాంబరం పెరుంగళత్తూరుకు చెందిన కార్తీక(30)తో అక్టోబర్ 28న పెళ్లి జరిగింది. ఈ నూతన దంపతులు కారులో సోమవారం ఉదయం పెరుంగళత్తూరు నుంచి అరక్కోణం బయలుదేరారు. కూవం వద్దకు రాగానే అటువైపు నుంచి వస్తున్న ఓ సిమెంట్ ట్యాంకర్ అదుపు తప్పి వీరు ప్రయాణిస్తున్న కారుపై పడింది. ఈ ప్రమాదంలో నూతన దంపతులు మనోజ్ కుమార్, కార్తీక అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News