నవవధువు ఆత్మహత్య.. అత్తింటి ఫ్యామిలీ జంప్!

దిశ, సూర్యాపేట : పెళ్లైన రెండు నెలలకే నవవధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన సూర్యాపేట జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. దీంతో మృతదేహాన్ని అత్తింటి ముందు పెట్టి బాధిత కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. అదనపు కట్నం కోసం వేధించడం వల్లే కవిత చనిపోయిందని బంధువులు ఆరోపించారు. వివరాల్లోకి వెళితే.. చిలుకూరు మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన తోటి రామారావు ,శైలజ దంపతుల కుమార్తె కవిత(19)కు హుజూర్ నగర్ మండలం శ్రీనివాసపురానికి చెందిన వాగ్దేటి వెంకటకృష్ణతో రెండు నెలల కిందట […]

Update: 2021-01-28 11:14 GMT

దిశ, సూర్యాపేట : పెళ్లైన రెండు నెలలకే నవవధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన సూర్యాపేట జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. దీంతో మృతదేహాన్ని అత్తింటి ముందు పెట్టి బాధిత కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. అదనపు కట్నం కోసం వేధించడం వల్లే కవిత చనిపోయిందని బంధువులు ఆరోపించారు. వివరాల్లోకి వెళితే.. చిలుకూరు మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన తోటి రామారావు ,శైలజ దంపతుల కుమార్తె కవిత(19)కు హుజూర్ నగర్ మండలం శ్రీనివాసపురానికి చెందిన వాగ్దేటి వెంకటకృష్ణతో రెండు నెలల కిందట వివాహం జరిగింది. వరుడు వ్యాపార నిమిత్తం మూడేళ్లుగా కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలో ఉంటున్నాడు. వారం కిందటే భార్యను అక్కడికి తీసుకెళ్లాడు.

అయితే, వెంకటకృష్ణకు గతంలో కొంతమంది మహిళలతో వివాహేతర సంబంధం ఉండేదని సమాచారం. ఈ నేపథ్యంలోనే అత్తింటివారు కవితను వరకట్న వేధింపులకు గురిచేశారని, అందువల్లే ఆమె ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నదని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం కవిత మృతదేహాన్ని బుధవారం శ్రీనివాసపురంలోని వెంకటకృష్ణ ఇంటికి తీసుకెళ్లగా.. అప్పటికే వరుడితో సహా కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి పారిపోయారు. దీంతో అమ్మాయి తరపు బంధువులు ఆందోళన దిగడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమ కూతురి మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని బాధిత తల్లిదండ్రులు డిమాండ్ కోరుతున్నారు.

Tags:    

Similar News