విద్యుత్ సర్వీస్ వైరు తెగి రైతు మృతి

ప్రమాదవశాత్తు విద్యుత్ వైరు తెగి మీద పడడంతో ఓ రైతు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కూసుమంచి మండలంలో బుధవారం చోటు చేసుకుంది.

Update: 2024-12-25 10:42 GMT

దిశ, కూసుమంచి : ప్రమాదవశాత్తు విద్యుత్ వైరు తెగి మీద పడడంతో ఓ రైతు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కూసుమంచి మండలంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ముత్యాలగూడెం గ్రామానికి చెందిన రైతు తాటికొండ రామారావు (50) తన వ్యవసాయ క్షేత్రంలో నిచ్చెన సహాయంతో బోరు మోటార్ కు విద్యుత్ సరఫరా కనెక్షన్ ఇచ్చే క్రమంలో ప్రమాదవశాత్తు సర్వీస్ వైర్ తెగి రామారావుపై పడడంతో షార్ట్ సర్క్యూట్ అయి అక్కడికక్కడే మృతి చెందాడు. రామారావు మృతితో ముత్యాల గూడెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 


Similar News