హనీట్రాప్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్
సంచలనంగా మారిన విశాఖ హనీట్రాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
దిశ, వెబ్ డెస్క్: సంచలనంగా మారిన విశాఖ హనీట్రాప్ కేసు(Visakha honeytrap case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. జాయ్ జెమీమా(Joy Jemima) అనే మహిళ సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని అందమైన అమ్మాయిల ఫోటోలు పంపి వారిని ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేసింది. హనీట్రాప్(honeytrap case) చేసి.. సదరు వ్యక్తులను రూమ్‌కు పిలిపించుకోవడం.. వారికి మత్తు మందు ఇచ్చి నగ్న ఫోటోలు తీసుకుని వాటితో బెదిరించి వసూళ్లకు పాల్పడింది. ఈ కేసు వెలుగులోకి రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు జాయ్ జెమీమా అరెస్ట్ చేశారు. అలాగే ఆమెకు పలువురు సహకరించినట్లు గుర్తించి వారిపై వేట కొనసాగించారు. ఈ క్రమంలోనే ఫారెస్ట్ అధికారి వేణు భాస్కర్‌రెడ్డిని పక్కా సచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే డిసెంబర్ 25 ఉదయం మరో ముగ్గురిని హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. వారు ఫాతిమా ఉస్మాన్ చౌదరి అలియాస్ జోయా, ఆమె భర్త తన్వీర్, అవినాష్ బెంజిమన్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్‌లోనే కోర్టులో హాజరుపరిచారు. అనంతరం రిమాండ్ ఖైదీలుగా ముగ్గురిని విశాఖకు తరలించినట్లు తెలిపారు.