కరీంనగర్‌లో ‘ఫీడ్ బ్యాక్ డే’

దిశ, కరీంనగర్: హలో సర్ నమస్కారం.. నేను కరీంనగర్ వన్ టౌన్ పీఎస్ నుంచి మాట్లాడుతున్నాము..మీరు మా స్టేషన్‌లో ఓ కేసు విషయమై ఫిర్యాదు చేశారు కదా..మీరిచ్చిన దరఖాస్తును అనుసరించి ఎఫ్ఐఆర్ నమోదు చేశాము. నిందితుల గురించి వాకబు చేయడమే కాకుండా అరెస్ట్ కూడా చేస్తున్నాం. మీరిచ్చిన ఫిర్యాదు మేరకు చార్జిషీటు కూడా త్వరలో కోర్టులో సమర్పిస్తాం.ఏమైనా అనుమానాలు ఉంటే మాకు తెలియపరచండి థాంక్యూ సర్.. ఇకమీదట కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పీఎస్‌ల నుంచి ఫిర్యాదు […]

Update: 2020-06-06 06:51 GMT

దిశ, కరీంనగర్: హలో సర్ నమస్కారం.. నేను కరీంనగర్ వన్ టౌన్ పీఎస్ నుంచి మాట్లాడుతున్నాము..మీరు మా స్టేషన్‌లో ఓ కేసు విషయమై ఫిర్యాదు చేశారు కదా..మీరిచ్చిన దరఖాస్తును అనుసరించి ఎఫ్ఐఆర్ నమోదు చేశాము. నిందితుల గురించి వాకబు చేయడమే కాకుండా అరెస్ట్ కూడా చేస్తున్నాం. మీరిచ్చిన ఫిర్యాదు మేరకు చార్జిషీటు కూడా త్వరలో కోర్టులో సమర్పిస్తాం.ఏమైనా అనుమానాలు ఉంటే మాకు తెలియపరచండి థాంక్యూ సర్..

ఇకమీదట కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పీఎస్‌ల నుంచి ఫిర్యాదు దారులకు ఈ విధమైన ఫోన్లు రానున్నాయి. కేసుల పరిశోధన, వాటిపై పోలీసులు ఏ విధంగా దృష్టి సారించాలన్న ఆలోచనతో సీపీ కమలాసన్ రెడ్డి వినూత్న విధానానికి శ్రీకారం చుట్టారు. ప్రతి నెల 10న ‘ఫీడ్ బ్యాక్’ డే పేరిట ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనివల్ల ఫిర్యాదు చేసిన వారికి వారి కేసు పురోగతి తెలిసే అవకాశం ఉండడంతో పాటు, పోలీసుల పారదర్శకత ఎలాంటిదో చేతల్లో చూపాలని సీపీ నిర్ణయించారు. కొత్తగా అమలు చేయనున్న ఈ పద్ధతిని ఖచ్చితంగా ప్రతి ఠాణాలో అమలు చేయాల్సిందేనని సీపీ కమలాసన్ రెడ్డి ఆధేశాలు జారీ చేశారు. పోలీసులు కేసు పరిశోధనలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించడం వల్ల వారు సంతృప్తి చెందే అవకాశం కూడా ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఫిర్యాదు దారుడు దరఖాస్తు ఇచ్చిన తర్వాత సార్ మా కేసేమైంది? అని అడిగేందుకు ఠాణాల చుట్టూ తిరగాల్సి వచ్చే పద్ధతికి ఇకనుంచి బ్రేక్ పడనున్నది. పోలీసులే ఫోన్ చేసి సమాచారం ఇస్తుండటంతో ఫిర్యాదు దారులు కాల్ రిసీవ్ చేసుకుంటేనే కేసు పూర్వాపరాలు తెలుసుకునే అవకాశం రానుంది.

ఆకస్మిక తనిఖీలు…

వినూత్నంగా సీపీ కమలాసన్ రెడ్డి చేపట్టిన ‘ఫీడ్ బ్యాక్’ డే ప్రోగ్రాంపై సీపీ ప్రత్యేకంగా వివిధ పోలీసు స్టేషన్ల‌కు వెళ్లి స్వయంగా పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ అన్ని స్టేషన్లలో ఈ కార్యక్రమం ఎలా అమలవుతుందో కూడా తెలుసుకుంటారు. ఈలాచేస్తే పోలీసు యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేసే అవకాశం తక్కువగా ఉంటుందని సీపీ భావిస్తున్నారు. నూతనంగా అమలు కానున్న ఈ విధానం వల్ల పోలీసుల్లో మరింత జవాబుదారీ తనం పెరుగుతుందన్న ఆలోచనతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్టు సీపీ కమలాసన్ రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News