న్యూజిలాండ్‌లో వైరస్ సోర్స్ కోసం తంటాలు
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌లో వైరస్ పాజిటివ్ కేసులన్నీ రికవరీలుగా మారిన 102 రోజుల తర్వాత మళ్లీ తొలిసారిగా నలుగురికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ఈ నలుగురికి వైరస్ ఎవరి నుంచి సోకిందో తెలుసుకోవడానికి ఆ దేశ ఆరోగ్య అధికారులు తంటాలు పడుతున్నారు. ఆక్లాండ్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురిలో పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. వీరితో కాంటాక్ట్‌లోకి వచ్చినట్టుగా భావిస్తున్న 200 మందిని విచారించినట్టు ప్రధాని జెసిండా అర్డెర్న్ వెల్లడించారు. కాగా, ఆ నలుగరితో రెగ్యులర్‌గా టచ్‌లో […]
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌లో వైరస్ పాజిటివ్ కేసులన్నీ రికవరీలుగా మారిన 102 రోజుల తర్వాత మళ్లీ తొలిసారిగా నలుగురికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ఈ నలుగురికి వైరస్ ఎవరి నుంచి సోకిందో తెలుసుకోవడానికి ఆ దేశ ఆరోగ్య అధికారులు తంటాలు పడుతున్నారు. ఆక్లాండ్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురిలో పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. వీరితో కాంటాక్ట్‌లోకి వచ్చినట్టుగా భావిస్తున్న 200 మందిని విచారించినట్టు ప్రధాని జెసిండా అర్డెర్న్ వెల్లడించారు. కాగా, ఆ నలుగరితో రెగ్యులర్‌గా టచ్‌లో ఉన్న మరో నలుగురు అనుమానితులకు కరోనా టెస్టులు చేశారు. అయితే, ఇంకా కొత్త కేసులకు సోర్స్ మాత్రం కనుగొనలేకపోయారు. వేట సాగుతూనే ఉన్నది.