కరోనా బాధితులకు వెటోరీ ఆర్థిక సాయం
దిశ, స్పోర్ట్స్: కరోనాపై పోరాటంలో భాగంగా ఎంతో మంది క్రీడాకారులు విరాళాలు అందించారు. ఇప్పటివరకు ఎవరికి వారు తమ సొంత దేశాలకు విరాళం ఇచ్చారు. కానీ, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డానియేల్ వెటోరీ మాత్రం బంగ్లాదేశ్‌కు కొంత మొత్తాన్ని విరాళంగా ఇచ్చాడు. ఆయన ప్రస్తుతం బంగ్లాదేశ్ జట్టుకు స్పిన్ కోచ్‌గా ఉన్నాడు. గత ఏడాది జూలైలో కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన వెటోరీకి ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ వరకూ కాంట్రాక్టు ఉంది. ఇందుకుగాను బంగ్లాదేశ్ క్రికెట్ […]
దిశ, స్పోర్ట్స్: కరోనాపై పోరాటంలో భాగంగా ఎంతో మంది క్రీడాకారులు విరాళాలు అందించారు. ఇప్పటివరకు ఎవరికి వారు తమ సొంత దేశాలకు విరాళం ఇచ్చారు. కానీ, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డానియేల్ వెటోరీ మాత్రం బంగ్లాదేశ్‌కు కొంత మొత్తాన్ని విరాళంగా ఇచ్చాడు. ఆయన ప్రస్తుతం బంగ్లాదేశ్ జట్టుకు స్పిన్ కోచ్‌గా ఉన్నాడు. గత ఏడాది జూలైలో కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన వెటోరీకి ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ వరకూ కాంట్రాక్టు ఉంది. ఇందుకుగాను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వెటోరీకి రూ.1.88కోట్ల వేతనం ఇచ్చింది. ఈ వేతనంలో కొంత మొత్తాన్ని కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి అందించాలని బీసీబీని వెటోరీ కోరాడు. కాగా, ఎంత మొత్తాన్ని అతడు విరాళంగా ఇచ్చాడనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.