మరో వూహాన్.. న్యూయార్క్ నగరం
కరోనా వైరస్ మహమ్మారికి మూల కేంద్రం చైనాలో వూహాన్ నగరం. ఇక్కడ పుట్టిన వైరస్ ప్రపంచం మొత్తానికి విస్తరించింది. వందల కోట్ల మంది ప్రజలు ఇంటికే పరిమితం కావాల్సింది. ప్రస్తుతం వూహాన్ కోలుకుంటోంది. కానీ, న్యూయార్క్ నగరం మరో వూహాన్ నగరంగా మారుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. మంగళవారం కరోనా వైరస్ కేసులు పెద్ద ఎత్తున నమోదు కావడంతో అతి త్వరలోనే న్యూయార్క్ నగరాన్ని మహమ్మారి ముంచెత్తనుందని తెలిపింది. ఈ నేపథ్యంలో అమెరికాలో […]
కరోనా వైరస్ మహమ్మారికి మూల కేంద్రం చైనాలో వూహాన్ నగరం. ఇక్కడ పుట్టిన వైరస్ ప్రపంచం మొత్తానికి విస్తరించింది. వందల కోట్ల మంది ప్రజలు ఇంటికే పరిమితం కావాల్సింది. ప్రస్తుతం వూహాన్ కోలుకుంటోంది. కానీ, న్యూయార్క్ నగరం మరో వూహాన్ నగరంగా మారుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. మంగళవారం కరోనా వైరస్ కేసులు పెద్ద ఎత్తున నమోదు కావడంతో అతి త్వరలోనే న్యూయార్క్ నగరాన్ని మహమ్మారి ముంచెత్తనుందని తెలిపింది. ఈ నేపథ్యంలో అమెరికాలో మరికొన్ని హాస్పిటల్ పడకలను అందుబాటులోకి తీసుకురావాలని డబ్ల్యూహెచ్‌ఓ కోరింది.
న్యూయార్క్ నగరం జనాభా 80 లక్షలకు పైగానే ఉంటుంది. ఇప్పటివరకు కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు 15,000 నమోదు అయ్యాయి. దాదాపు 157 మంది మృతిచెందారు. అమెరికాలో నమోదైన కేసుల్లో మూడింట ఒక్క వంతు న్యూయార్క్ నగరంలోనే నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో న్యూయార్క్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. పనిప్రదేశాలు, రవాణా, జన సమీకరణాలపై తీవ్ర ఆంక్షలు విధించింది. అమెరికా ప్రజలకు ఎవరికీ ఆర్థిక వ్యవస్థపై బెంగలేదు. ఎందుకంటే ప్రజారోగ్యం కంటే అది ముఖ్యం కాదని అందరికీ తెలుసని న్యూయార్క్ గవర్నర్ అండ్రూ క్యూమో పేర్కొన్నారు. మ్యాన్‌హట్టన్ కన్వెన్షన్ సెంటర్‌ను 1000 పడకల తాత్కాలిక హాస్పిటల్‌గా మారుస్తున్నట్లు ప్రకటించారు.
Tags: new-york, epicentre, us, coronavirus, outbreak