నైజీరియాలో కొత్త వేరియంట్ వైరస్!

దిశ, వెబ్‌డెస్క్ : యూకేలో కరోనావైరస్ కొత్త స్ట్రెయిన్, దక్షిణాఫ్రికాలో ఇంకోరకం కరోనా వైరస్ కలకలం సృష్టించగా, తాజాగా నైజీరియాలో సరికొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. నైజీరియాలో కరోనా కొత్త రకం వేరియంట్ వెలుగులోకి వచ్చిందని ఆఫ్రికాకు చెందిన టాప్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ ధ్రువీకరించారు. యూకే, దక్షిణాఫ్రికాల కంటే నైజీరియాలోని కరోనావైరస్ వేరే రూపంలో ఉన్నదని ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ హెడ్ జాన్ కంగాసంగ్ వివరించారు. మరిన్ని శాంపిళ్లను పరిశీలిస్తున్నామని, […]

Update: 2020-12-24 09:49 GMT

దిశ, వెబ్‌డెస్క్ : యూకేలో కరోనావైరస్ కొత్త స్ట్రెయిన్, దక్షిణాఫ్రికాలో ఇంకోరకం కరోనా వైరస్ కలకలం సృష్టించగా, తాజాగా నైజీరియాలో సరికొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. నైజీరియాలో కరోనా కొత్త రకం వేరియంట్ వెలుగులోకి వచ్చిందని ఆఫ్రికాకు చెందిన టాప్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ ధ్రువీకరించారు. యూకే, దక్షిణాఫ్రికాల కంటే నైజీరియాలోని కరోనావైరస్ వేరే రూపంలో ఉన్నదని ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ హెడ్ జాన్ కంగాసంగ్ వివరించారు. మరిన్ని శాంపిళ్లను పరిశీలిస్తున్నామని, ఈ వేరియంట్‌పై పరీక్షలు జరపడానికి తమకు మరింత సమయం కావాలని అడిగారు.

ఇంకా ప్రాథమిక దశలోనే తమ పరిశీలనలున్నాయని పేర్కొన్నారు. తమకు మరింత సమయం కావాలని, కొత్త వేరియంట్‌పై ఇప్పుడే వివరాలు చెప్పలేమని తెలిపారు. నైజీరియాలోని ఒసన్ రాష్ట్రంలో ఆగస్టు 3న, అక్టోబర్ 9న ఇద్దరు పేషెంట్ల నుంచి సేకరించిన నమూనాల్లో ఈ కొత్త రకం వైరస్ వెలుగుచూసిందని చెప్పారు. యూకే తరహాలో నైజీరియాలో కొత్త వేరియంట్‌తో కేసులు భారీగా నమోదవుతున్నట్టుగా కనిపించడం లేదని, పీ681హెచ్ వేరియంట్ వేగంగా విస్తరిస్తున్నదని చెప్పే ఆధారాలు లేవని తెలిపారు. అయితే, జీనోమ్ సీక్వెన్స్‌ను ట్రాక్ చేసే సామర్థ్యం యూకే కంటే నైజీరియాలో తక్కువగా ఉంటుందనీ వివరించారు.

Tags:    

Similar News