నయా టెలీగ్రామ్.. కొత్త ఫీచర్‌తో అదరహో..

దిశ, వెబ్‌డెస్క్ : టెలీగ్రామ్ యాప్. ప్రస్తుతం వాట్సాప్‌కు గట్టిపోటీ ఇస్తోంది. కొత్త ప్రైవసీ పాలసీని తీసుకువస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించడంతో వివాదం నెలకొంది. ఈ కారణంగా అప్పటి వరకు అంతంత మాత్రంగా వాడుతున్న టెలీగ్రామ్ ఒక్కసారిగా ఫేమ్ అయింది. అప్పటి వరకు ఉన్న డౌన్ లోడ్‌లకు సమానంగా కొత్తగా డౌన్ లోడ్‌లు పెరిగాయి. 2018లో టెలీగ్రామ్ యూజర్ల సంఖ్య 200 మిలియన్‌లు ఉండగా.. 2020లో ఆ సంఖ్య 400 మిలియన్‌లకు చేరింది. టెలీగ్రామ్‌కు ఉహించని స్థాయిలో యూజర్లు […]

Update: 2021-04-30 07:14 GMT

దిశ, వెబ్‌డెస్క్ : టెలీగ్రామ్ యాప్. ప్రస్తుతం వాట్సాప్‌కు గట్టిపోటీ ఇస్తోంది. కొత్త ప్రైవసీ పాలసీని తీసుకువస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించడంతో వివాదం నెలకొంది. ఈ కారణంగా అప్పటి వరకు అంతంత మాత్రంగా వాడుతున్న టెలీగ్రామ్ ఒక్కసారిగా ఫేమ్ అయింది. అప్పటి వరకు ఉన్న డౌన్ లోడ్‌లకు సమానంగా కొత్తగా డౌన్ లోడ్‌లు పెరిగాయి. 2018లో టెలీగ్రామ్ యూజర్ల సంఖ్య 200 మిలియన్‌లు ఉండగా.. 2020లో ఆ సంఖ్య 400 మిలియన్‌లకు చేరింది.

టెలీగ్రామ్‌కు ఉహించని స్థాయిలో యూజర్లు పెరగడంతో యాప్ యాజమాన్యం కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఈ విషయాన్ని స్వయంగా టెలీగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ వెల్లడించారు.
టెలీగ్రామ్‌లో గ్రూప్ వీడియో కాల్ ఫీచర్ రానుంది. మే నెలలో దీనిని అందుబాటులోకి తెస్తున్నట్లు సమాచారం. అయితే ఈ గ్రూప్ వీడియో కాల్ ఫీచర్‌ను తొలుత ఐవోఎస్ యూజర్లకు అందుబాటులోకి వస్తుందని పావెల్ దురోవ్ తెలిపారు.

దీంతో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా వీడియో కాల్స్‌కు స్క్రీన్ షేరింగ్, ఎన్‌క్రిప్షన్, నాయిస్ క్యాన్సలేషన్, డెస్క్‌టాప్ అండ్ టాబ్లెట్ సపోర్ట్, వీడియో కాన్ఫరెన్స్ టూల్స్, టెలీగ్రామ్ లెవల్ యూఐ వంటి ఫీచర్లను తమ వినియోగదారులకు ప్రవేశపెడుతున్నట్లు టెలీగ్రామ్ సీఈవో దురోవ్ వెల్లడించారు. కాగా టెలీగ్రామ్ ఇప్పటికే ప్రైవేట్ వీడియో కాల్స్ కోసం ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను అందిస్తోంది. ఇప్పుడు ఈ ఎన్‌క్రిప్షన్ విధానాన్ని గ్రూప్ వీడియో కాల్స్‌కు కూడా అందించనుంది.

Tags:    

Similar News