మహిళా టీ20 ఛాలెంజ్.. జైపూర్‌లో !
ఐపీఎల్ ప్లేఆఫ్స్ సమయంలో బీసీసీఐ మహిళా జట్లతో టీ20 ఛాలెంజ్ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. గత ఏడాది ముంబైలో మూడు జట్లతో ఈ ఛాలెంజ్ నిర్వహించిన బీసీసీఐ..ఈ సారి జైపూర్‌లో నాలుగు జట్లతో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సారి కూడా ఐపీఎల్ ప్లేఆఫ్ మ్యాచులు జరిగే సమయంలోనే ఈ టీ20 ఛాలెంజ్ మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. 2018లో హర్మన్‌ప్రీత్ సారథ్యంలో సూపర్ నోవాస్, స్మృతి మంధానా సారథ్యంలో ట్రయల్‌బ్లేజర్స్ జట్లు బరిలో దిగాయి. 2019లో ఈ […]
ఐపీఎల్ ప్లేఆఫ్స్ సమయంలో బీసీసీఐ మహిళా జట్లతో టీ20 ఛాలెంజ్ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. గత ఏడాది ముంబైలో మూడు జట్లతో ఈ ఛాలెంజ్ నిర్వహించిన బీసీసీఐ..ఈ సారి జైపూర్‌లో నాలుగు జట్లతో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సారి కూడా ఐపీఎల్ ప్లేఆఫ్ మ్యాచులు జరిగే సమయంలోనే ఈ టీ20 ఛాలెంజ్ మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది.
2018లో హర్మన్‌ప్రీత్ సారథ్యంలో సూపర్ నోవాస్, స్మృతి మంధానా సారథ్యంలో ట్రయల్‌బ్లేజర్స్ జట్లు బరిలో దిగాయి. 2019లో ఈ రెండు జట్లకు తోడు మిథాలీ రాజ్ సారథ్యంలోని మరో జట్టు కూడా బరిలో నిలిచింది. ఇక ఈసారి నాలుగు జట్లు పాల్గొంటాయని ఐపీఎల్ యాజమాన్యం పేర్కొంది.
స్వదేశీ, విదేశీ ఆటగాళ్లతో కూడిన ఈ ఛాలెంజర్‌లో కొత్తగా రాబోయే టీమ్‌ను మాత్రం ఇప్పటివరకు ప్రకటించలేదు. మహిళా టీ20 వరల్డ్ కప్ అనంతరం ఈ జట్టును ప్రకటించే అవకాశం ఉంది.