కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ.. టీఆర్ఎస్ క్యాడర్‌లో నయా జోష్
దిశ, హుజూరాబాద్: పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ రావడంతో ఆయన వెంట టీఆర్ఎస్ శ్రేణులు హైదరాబాద్‌కు తరలివెళ్లారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన అధిష్టానం సోమవారం సమాచారం అందజేసింది. దీంతో నామినేషన్ దాఖలు చేయడానికి తనతో రావాల్సిందిగా అభిమానులు, టీఆర్ఎస్ శ్రేణులకు ఫోన్ కాల్ చేసి కౌశిక్ స్వయంగా ఆహ్వానించారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మంగళవారం ఉదయం హైదరాబాద్‌కు తరలివెళ్లి కౌశిక్‌కు అభినందనలు తెలిపారు. ఆరుకు […]
దిశ, హుజూరాబాద్: పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ రావడంతో ఆయన వెంట టీఆర్ఎస్ శ్రేణులు హైదరాబాద్‌కు తరలివెళ్లారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన అధిష్టానం సోమవారం సమాచారం అందజేసింది. దీంతో నామినేషన్ దాఖలు చేయడానికి తనతో రావాల్సిందిగా అభిమానులు, టీఆర్ఎస్ శ్రేణులకు ఫోన్ కాల్ చేసి కౌశిక్ స్వయంగా ఆహ్వానించారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మంగళవారం ఉదయం హైదరాబాద్‌కు తరలివెళ్లి కౌశిక్‌కు అభినందనలు తెలిపారు. ఆరుకు ఆరు ఎమ్మెల్సీ స్థానాలలో టీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచే అవకాశాలు ఉండడంతో కౌశిక్ విజయం లాంఛనమే కానుంది.
ఇటీవల హుజూరాబాద్‌లో జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా కేసీఆర్ సమక్షంలో అనుచరులతో కలిసి టీఆర్ఎస్‌లో చేరిన కౌశిక్‌కు అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవి వరించింది. కేసీఆర్ సీరియస్‌గా తీసుకున్నప్పటికీ హుజూరాబాద్ బై పోల్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి పరాజయం పొందడంతో నిరూత్సాహం చెందిన క్యాడర్‌కు.. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం రావడంతో నియోజకవర్గంలోని టీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త జోష్ నింపింది. ఇక 2023 ఎన్నికలే టార్గెట్‌గా కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి సీఎం కేసీఆర్ ప్రాధాన్యత కల్పించినట్లు పార్టీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.