న్యూ ఇన్‌కమ్ ట్యాక్స్: పెరుగుతున్న ఫిర్యాదులు

దిశ, వెబ్‌డెస్క్: ఆదాయ పన్ను శాఖ కొత్తగా ప్రారంభించిన ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కొత్త వెబ్‌సైట్ ప్రారంభించిన వారం రోజులు గడిచినప్పటికీ చార్టర్డ్ అకౌంటెంట్‌లు పన్ను చెల్లించడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక ఫిర్యాదూ పెరిగాయి. ఇంకా ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నట్టు తెలుస్తోంది. ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ అయ్యేందుకు ఇంతకుముందు కంటే ఎక్కువ సమయం పడుతోందని ఫిర్యాదులు అందుతున్నాయి. గతవారం ఇటువంటి సాంకేతిక సమస్యలపై వచ్చిన […]

Update: 2021-06-14 08:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆదాయ పన్ను శాఖ కొత్తగా ప్రారంభించిన ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కొత్త వెబ్‌సైట్ ప్రారంభించిన వారం రోజులు గడిచినప్పటికీ చార్టర్డ్ అకౌంటెంట్‌లు పన్ను చెల్లించడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక ఫిర్యాదూ పెరిగాయి. ఇంకా ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నట్టు తెలుస్తోంది. ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ అయ్యేందుకు ఇంతకుముందు కంటే ఎక్కువ సమయం పడుతోందని ఫిర్యాదులు అందుతున్నాయి. గతవారం ఇటువంటి సాంకేతిక సమస్యలపై వచ్చిన ఫిర్యాదులకు స్పందించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమస్యల పరిష్కారాన్ని ఆదేశిస్తూ పోర్టల్‌ను నిర్వహిస్తున్న ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలేకనికి సూచించారు.

ఇప్పటికి వారం గడుస్తున్నా ఈ పోర్టల్‌లో పలు ఫీచర్లు పనిచేయడంలేదని ఇంకా ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ-ప్రొసీడింగ్స్ సరిగా పనిచేయడంలేదని, కొన్ని పాత ఫీచర్లు సైతం సరిగా పనిచేయడంలేదనే ఫిర్యాదులు పెరిగాయి. పాస్‌వర్డ్ మర్చుకోవడానికి కూడా నిమిషాల వ్యవధి పడుతోందని, గతంలో దాఖలు చేసిన ఈ-ఫైలింగ్ రిటర్నులు కనిపించడంలేదని కొందరు చార్టర్డ్ అకౌంటెంట్లు చెబుతున్నారు. వీలైనంత తొందరగా ఈ సమస్యలను పరిష్కరించాలన్నారు.

Tags:    

Similar News