అలర్ట్.. పాస్‌వర్డ్‌లను దొంగిలించే ‘ఫ్లూబోట్’ మాల్వేర్
దిశ, ఫీచర్స్ : యాప్స్ అండ్ గేమ్స్ ఇన్‌స్టాల్ చేసుకునేందుకు ఆండ్రాయిడ్ వినియోగదారులకు గూగుల్ ప్లే స్టోర్‌ను సురక్షితమైన ప్లాట్‌ఫామ్‌గా చెప్పొచ్చు. స్టోర్‌లో అప్‌లోడ్ చేసిన యాప్‌లను ఎప్పటికప్పుడు స్కాన్ చేస్తూ, మాల్వేర్ దాడుల పట్ల తమ కస్టమర్స్‌ను అప్రమత్తం చేయడంతో పాటు, అలాంటి యాప్స్‌ను డిలీట్ చేస్తుంటుంది. అంతేకాదు కంపెనీ ప్లే స్టోర్‌లో కాకుండా ఇతర సోర్స్‌ల ద్వారా ఇన్‌స్టాల్ చేసే థర్డ్ పార్టీ యాప్‌ల విషయంలోనూ గూగుల్ ప్లే ప్రొటెక్ట్‌ను అందిస్తుంది. అయితే ఈ […]
దిశ, ఫీచర్స్ : యాప్స్ అండ్ గేమ్స్ ఇన్‌స్టాల్ చేసుకునేందుకు ఆండ్రాయిడ్ వినియోగదారులకు గూగుల్ ప్లే స్టోర్‌ను సురక్షితమైన ప్లాట్‌ఫామ్‌గా చెప్పొచ్చు. స్టోర్‌లో అప్‌లోడ్ చేసిన యాప్‌లను ఎప్పటికప్పుడు స్కాన్ చేస్తూ, మాల్వేర్ దాడుల పట్ల తమ కస్టమర్స్‌ను అప్రమత్తం చేయడంతో పాటు, అలాంటి యాప్స్‌ను డిలీట్ చేస్తుంటుంది. అంతేకాదు కంపెనీ ప్లే స్టోర్‌లో కాకుండా ఇతర సోర్స్‌ల ద్వారా ఇన్‌స్టాల్ చేసే థర్డ్ పార్టీ యాప్‌ల విషయంలోనూ గూగుల్ ప్లే ప్రొటెక్ట్‌ను అందిస్తుంది. అయితే ఈ ప్రొటెక్షన్ ఉన్నప్పటికీ, ప్రమాదకరమైన యాప్‌ల వల్ల వినియోగదారుల డేటా తరచుగా చోరీ అవుతూనే ఉంది. తాజాగా ‘ఫ్లూబోట్’ అనే మాల్వేర్.. యూజర్ల పాస్‌వర్డ్‌లను దొంగిలిస్తున్నట్లుగా తెలిసింది.
SMS ద్వారా వ్యాపించే ఫ్లూబోట్ ‘టెక్స్ట్ మెసేజ్ స్కామ్’.. ప్యాకేజీ డెలివరీ సంస్థ నుంచి వచ్చిన మెసేజ్‌ను పోలిఉంటుంది. వినియోగదారులు వారి డెలివరీని ట్రాక్ చేసేందుకు తాము పంపిన మెసేజ్ లింక్‌లోని యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాల్సిందిగా కోరుతుంది. అయితే సదరు యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో లేకపోవడంతో, లింక్ చేసిన APK (ప్యాకేజీ ఇన్‌స్టాలర్) ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి, మాన్యువల్‌గా ఇన్‌స్టాల్ చేస్తారు. దీనివల్ల భద్రతాపరమైన చిక్కులు వస్తాయని హెచ్చరించినా, పట్టించుకోకుండా అనుమతి ఇచ్చేస్తాం. ఆ తర్వాత మాల్వేర్ దాడి చేసి, పాస్‌వర్డ్‌లు దొంగిలిస్తుంది.
⚠️SCAM TEXT ALERT ⚠️
If you receive a text message that looks like the one below:
IGNORE: Do not click any links.
REPORT: Report it by forwarding to 7726.
DELETE: Remove the text from your phone. pic.twitter.com/ailKcmXYh4
— Vodafone UK (@VodafoneUK) April 22, 2021
కాగా, మాల్వేర్ బారిన పడిన వినియోగదారులు వారి డేటాను రక్షించుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని.. పాస్‌వర్డ్‌లు, క్రెడిన్షియల్ వివరాలకు సంబంధించిన వినియోగదారుల సమాచారాన్ని మాల్వేర్ ఎలా డీకోడ్ చేస్తుందో ఇప్పటికీ అస్పష్టంగా ఉందని యూకే నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ (NCSC) తెలిపింది. అంతేకాదు మాల్వేర్ ప్రభావితమైన వినియోగదారులు వెంటనే అప్రమత్తమై కొత్త ఖాతాల్లోకి లాగిన్ కాకూడదని, సిస్టమ్/మొబైల్ రీసెట్ చేయాలని ఎన్‌సీఎస్‌సీ తెలిపింది.