న్యూయార్క్‌లో కొత్త వ్యాధి.. ఇప్పటికే ఐదుగురు చిన్నారులు మృతి

ప్రపంచం మొత్తం కరోనా వైరస్ బారిన పడి అతలాకుతలం అవుతున్న విషయం తెలిసిందే. దాని నుంచి పూర్తిగా కోలుకోక ముందే మరో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. అమెరికాలోని న్యూయార్క్ సిటీలో కరోనా నుంచి కోలుకున్న చిన్నారులకు కొత్త వ్యాధి సోకుతుంది. న్యూయార్క్‌లో కొత్త వ్యాధి బారిన పడ్డ చిన్నారులను దాదాపు 52 మందిని గుర్తించారు. చిన్నారులను పరీక్షించిన వైద్యులు కవాసాకీ లేదా టాక్సిషాక్ సిండ్రోమ్‌గా చెబుతున్నారు. ఇప్పటికే దీని మూలంగా ఐదుగురు చిన్నారులు చనిపోయినట్టు వెల్లడించారు. కరోనా […]

Update: 2020-05-12 23:16 GMT

ప్రపంచం మొత్తం కరోనా వైరస్ బారిన పడి అతలాకుతలం అవుతున్న విషయం తెలిసిందే. దాని నుంచి పూర్తిగా కోలుకోక ముందే మరో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. అమెరికాలోని న్యూయార్క్ సిటీలో కరోనా నుంచి కోలుకున్న చిన్నారులకు కొత్త వ్యాధి సోకుతుంది. న్యూయార్క్‌లో కొత్త వ్యాధి బారిన పడ్డ చిన్నారులను దాదాపు 52 మందిని గుర్తించారు. చిన్నారులను పరీక్షించిన వైద్యులు కవాసాకీ లేదా టాక్సిషాక్ సిండ్రోమ్‌గా చెబుతున్నారు. ఇప్పటికే దీని మూలంగా ఐదుగురు చిన్నారులు చనిపోయినట్టు వెల్లడించారు. కరోనా సోకిన ఆరు వారాల తర్వాత ఈ కొత్త వ్యాధి బయటపడుతోంది. లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని న్యూయార్క్ అధికారులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News