డెల్టా ప్లస్ ప్రమాదకరంగా మారవచ్చు.. ఎయిమ్స్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కరోనావైరస్ డెల్టా వేరియంట్ నుంచి ఉత్పరివర్తనం చెందిన డెల్టా ప్లస్ వేరియంట్ ప్రమాదకరంగా మారవచ్చునని, కాబట్టి, ఎప్పటికప్పుడు జీనోమ్ సీక్వెన్సింగ్ టెస్టులు చేస్తూ వైరస్ బిహేవియర్‌ను పర్యవేక్షించడం ప్రయోజనకరమని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా వివరించారు. ప్రస్తుతం డబ్ల్యూహెచ్‌వో డెల్టా ప్లస్ వేరియంట్ ప్రమాదకారిణిగా పేర్కొనలేదని, ఈ వేరియంట్‌తో కేసులు తక్కువగా ఉండటం వల్ల అలా పరిగణించిందని, కానీ, భవిష్యత్‌లో అది ప్రమాదకారిణిగా పరిణామం చెందే అవకాశముందని అన్నారు. ఈ వైరస్‌ను క్యాజువల్‌గా తీసుకోవద్దని, […]
న్యూఢిల్లీ: కరోనావైరస్ డెల్టా వేరియంట్ నుంచి ఉత్పరివర్తనం చెందిన డెల్టా ప్లస్ వేరియంట్ ప్రమాదకరంగా మారవచ్చునని, కాబట్టి, ఎప్పటికప్పుడు జీనోమ్ సీక్వెన్సింగ్ టెస్టులు చేస్తూ వైరస్ బిహేవియర్‌ను పర్యవేక్షించడం ప్రయోజనకరమని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా వివరించారు. ప్రస్తుతం డబ్ల్యూహెచ్‌వో డెల్టా ప్లస్ వేరియంట్ ప్రమాదకారిణిగా పేర్కొనలేదని, ఈ వేరియంట్‌తో కేసులు తక్కువగా ఉండటం వల్ల అలా పరిగణించిందని, కానీ, భవిష్యత్‌లో అది ప్రమాదకారిణిగా పరిణామం చెందే అవకాశముందని అన్నారు. ఈ వైరస్‌ను క్యాజువల్‌గా తీసుకోవద్దని, దాని మనుగడకు మళ్లీ మళ్లీ పరివర్తనం చెందుతున్నదని చెప్పారు. యూకే కొన్ని నెలలుగా లాక్‌డౌన్ పాటించి ఇప్పుడిప్పుడే సడలింపులు ఇస్తుండగా కొత్త వేరియంట్ విజృంభిస్తున్నదని గుర్తుచేశారు. యూకే నుంచి చూసి పాఠాలు నేర్చుకోవాలని సూచించారు.
రెండు అంశాలపై ఆధారపడి కొత్త వేవ్
కరోనా వైరస్ కొత్త వేవ్ రావడానికి రెండు అంశాలు కీలకంగా ఉంటాయని ఎయిమ్స్ డాక్టర్ నీరజ్ నిశ్చల్ వివరించారు. ఒకటి వైరస్ రిలేటెడ్ అయితే, మరొకటి మనిషి బిహేవియర్‌కు సంబంధించినదని తెలిపారు. వైరస్ మ్యుటేషన్ చెందడం మన చేతిలో లేని పని, కానీ, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, ఇతర నిబంధనలు పాటించడం మాత్రం ప్రజల చేతిలో ఉంటుందని, వీటిని పాటిస్తే మరో వేవ్‌ను అడ్డుకోవచ్చని అన్నారు.