ఏపీలో ఏమాత్రం తగ్గని కరోనా… 1332 పాజిటివ్ కేసులు

ఏపీలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గత మూడు రోజులుగా హాఫ్ సెంచరీకి తగ్గకుండా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూ రికార్డు దిశగా దూసుకుపోతున్నాయి. ఇదే రీతిలో కరోనా కేసులు నమోదైతే.. దేశంలోనే అత్యంత కరోనా ప్రభావిత ప్రాంతంగా ఏపీ అవతరిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో 12 జిల్లాలు కరోనా బారినపడగా, కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలు నువ్వానేనే అన్నా రీతిలో పాజిటివ్ కేసుల్లో ప్రగతి చాటుకుంటున్నాయి. ఏపీలో గడచిన 24 […]

Update: 2020-04-29 01:21 GMT

ఏపీలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గత మూడు రోజులుగా హాఫ్ సెంచరీకి తగ్గకుండా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూ రికార్డు దిశగా దూసుకుపోతున్నాయి. ఇదే రీతిలో కరోనా కేసులు నమోదైతే.. దేశంలోనే అత్యంత కరోనా ప్రభావిత ప్రాంతంగా ఏపీ అవతరిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో 12 జిల్లాలు కరోనా బారినపడగా, కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలు నువ్వానేనే అన్నా రీతిలో పాజిటివ్ కేసుల్లో ప్రగతి చాటుకుంటున్నాయి. ఏపీలో గడచిన 24 గంటల్లో 73 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. కర్నూలు జిల్లాలో 11 కొత్త కేసులు నమోదు కావడంతో 343 కేసులతో ఆ జిల్లా నెంబర్ వన్ స్థానంలో స్థిరంగా కొనసాగుతోంది. గుంటూరు జిల్లాలో నిన్న ఒక్కరోజే 29 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ జిల్లా 283 కరోనా పాజిటివ్ కేసులతో ట్రిపుల్ సెంచరీ దిశగా దూసుకుపోతూ ద్వితీయ స్థానంలో కొనసాగుతోంది.

కృష్ణా జిల్లాలో నిన్నకూడా కేసులు ఒక కొలిక్కి రాలేదు. అక్కడ కూడా 13 కేసులు నమోదయ్యాయి. 236 కేసులతో కృష్ణా జిల్లా మూడో స్ధానంలో కొనసాగుతోంది. ఆ తరువాతి స్థానంలో నెల్లూరు జిల్లా 82, చిత్తూరు జిల్లా 77, కడప జిల్లా 69, ప్రకాశం జిల్లా 60, అనంతపురం జిల్లా 58, పశ్చిమ గోదావరి జిల్లా 56, తూర్పు గోదావరి జిల్లా 40, విశాఖపట్టణం జిల్లాలో 23 కేసులు, శ్రీకాకుళం జిల్లాలో ఐదు కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో అనంతపురంలో 4, చిత్తూరులో 3, తూర్పుగోదావరిలో 1, గుంటూరులో 29, కడపలో 4, కృష్ణాలో 13, కర్నూలులో 11, ప్రకాశంలో 4, శ్రీకాకుళంలో 1, విశాఖపట్నంలో 1, పశ్చిమ గోదావరిలో 2 కేసులు నమోదయ్యాయి. విజయనగరంలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 73 కేసులు నమోదు కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1332 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 1014 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరో 287 మంది చికిత్స నందుకుని కోలుకుని పూర్తి ఆరోగ్యంతో ఇళ్లకు చేరారు. మరో 31 మంది దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయారు.

tags: ap, corona virus, covid-19, positive cases

Tags:    

Similar News