TDP: మంత్రి నారా లోకేశ్ చొరవ.. కేరళలో క్షేమంగా అయ్యప్ప భక్తులు

ఆంధ్రప్రదేశ్(Andra Pradesh) ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) చొరవతో కేరళ(kerala)లో చిక్కుకున్న అయ్యప్ప భక్తులు(Ayyappa Devotees) క్షేమంగా దర్శనానికి వెళ్లారు.

Update: 2024-11-19 13:31 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andra Pradesh) ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) చొరవతో కేరళ(kerala)లో చిక్కుకున్న అయ్యప్ప భక్తులు(Ayyappa Devotees) క్షేమంగా దర్శనానికి వెళ్లారు. నెల్లూరు(Nellore) నియోజకవర్గ పరిధి వెదురుకుప్పం మండలం గొడుగుచింత గ్రామానికి చెందిన అయ్యప్ప భక్తులు శబరిమల యాత్రకు కేరళ వెళ్లారు. ఈ క్రమంలో మార్గమధ్యంలో వారికి రోడ్డు ప్రమాదం(Accident) చోటు చేసుకుంది. దీంతో వారిని కేరళ పోలీసులు(Kerala Police) అదుపులోకి తీసుకున్నారు. దీనిపై వారు తమ తప్పు లేకున్నా తమని కేరళ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారని, దర్శనం ఉందని చెబుతున్నా సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో విడుదల చేశారు.

ఈ వీడియో పై స్పందించిన మంత్రి నారా లోకేష్ కేరళ ప్రభుత్వంతో మాట్లాడి వారిని క్షేమంగా తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామని ట్విట్టర్(Twitter) వేదికగా హామీ ఇచ్చారు. అనంతరం కేరళ అధికారులతో మాట్లాడి అక్కడ చిక్కుకున్న ఏపీకి చెందిన అయ్యప్ప స్వామి భక్తులను విడిపించి వారి శబరిమల యాత్ర కొనసాగించడానికి ఏర్పాట్లు చేయించారు. దీంతో వారు తమను సురక్షితంగా విడిపించి దర్శనానికి ఏర్పాట్లు చేసిన నారా లోకేష్ సహా ఇతర కూటమి ప్రభుత్వ నాయకులకు కృతజ్ఞతలు(Thanks) చెబుతూ.. భక్తుల బృందం మరో వీడియోను పోస్ట్ చేశారు. దీంతో ఆపదలో ఉన్నవారిని తక్షణమే స్పందించి కాపాడిన నారా లోకేష్ సహా కూటమి ప్రభుత్వంపై ప్రశంసలు కురుస్తున్నాయి

Tags:    

Similar News