Pawan Kalyan : మహిళల మిస్సింగ్ కేసులపై పవన్ కళ్యాణ్ ట్వీట్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(AP Deputy CM Pawan Kalyan) కూటమి ప్రభుత్వం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-11-19 11:22 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(AP Deputy CM Pawan Kalyan) కూటమి ప్రభుత్వం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో గత వారం రోజులుగా 18 మంది మహిళలు, బాలికలు మిస్ అయ్యారు. అయితే వీరందరినీ పోలీసులు క్షేమంగా రక్షించారు. తాజాగా ఈ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. మహిళలను, బాలికలను క్షేమంగా వారి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చిన పోలీసులను, హోం మంత్రి అనిత(Home Minister Anitha)ను, ఎన్టీఅర్ జిల్లా సీపీని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కేసులను వారం రోజుల్లోనే ఛేదించడం పట్ల ఎన్టీఅర్ జిల్లా పోలీసుల అంకితభావాన్ని పవన్ కొనియాడారు. కూటమి ప్రభుత్వం వలన రాష్ట్రంలో మార్పు మొదలైందని.. ఇది ఇలాగే కొనసాగుతూ పూర్తి మార్పును తీసుకు వస్తామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 

Tags:    

Similar News