Ramcharan : అయ్యప్ప మాలలో రామ్ చరణ్ దర్గా సందర్శన పై వివాదం!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కడప దర్గాను సందర్శించడం వివాదస్పదంగా మారింది.

Update: 2024-11-19 11:16 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: గ్లోబల్ స్టార్ (Ramcharan) రామ్‌చరణ్ కడప దర్గాను సందర్శించడం వివాదస్పదంగా మారింది. ఇస్లాం మతానికి సంబంధించిన దర్గాను ఎవరైనా సందర్శిస్తారు. అందులో ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. కానీ అయ్యప్ప స్వామి మాలలో ఉన్న రామ్‌చరణ్ (kadapa dargah) దర్గా సందర్శించడంపై అభ్యంతరాలు వెల్లడవుతున్నాయి. ఇందుకు సంబంధించిన చర్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దర్గా అంటే సమాధి అని, పవిత్రమైన అయ్యప్ప మాల వేసుకుని దర్గాకు వెళ్లడం ఏమిటని, మాలను తీసి దర్గా సందర్శించాలని పలువురు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ మాటతో రామ్ చరణ్ కడప దర్గాకు వెళ్తే.. హిందూమతం నుంచి ఇస్లాంలోకి వెళ్లిన (A. R. Rahman) రెహమాన్‌ను రామ్‌చరణ్ తిరుమల దర్శనం చేసుకోమనగలడా.. రెహమాన్ రాగలడా? అని చర్చ జరుగుతోంది.

మరోవైపు శబరిమల అయ్యప్ప సన్నిధిలో కూడా వావర్ స్వామి అనే ముస్లిం భక్తుడి సమాధి కూడా ఉంటుందని, అయ్యప్ప భక్తులు విధిగా ఆ దర్గాను సందర్శిస్తుంటారు. అక్కడ లేని తప్పు.. రామ్‌చరణ్ కడప దర్గాను సందర్శిస్తే తప్పేమిటని మరికొంత మంది రామ్ చరణ్ దర్గా సందర్శించడంపై సమర్ధిస్తున్నారు. అయితే.. వావర్ స్వామి అనేది ఓ కట్టుకథ అని, హిందూ భక్తులను తప్పు దారి పట్టించడానికే వావర్ స్వామి అనే ఓ ముస్లిం భక్తుడిని క్రియేట్ చేసినట్లు కొంత మంది నెటిజన్లు చర్చిస్తున్నారు. అయితే, చరణ్ అయ్యప్ప స్వామి మాల వేసుకున్న తర్వాత దీక్షలో ఉన్నప్పుడు నియమాలు ఉంటాయని నెటిజన్లు రామ్‌చరణ్‌కు సూచిస్తున్నారు. దీనిపై చరణ్ ఇంకా ఎలాంటి సమాధానం బెబుతారో వేచి చూడాలి.

Tags:    

Similar News