ప్రసవం కోసం వస్తే ప్రాణం తీశారు..!

దిశ, నాగర్ కర్నూల్ : ప్రసవం కోసం వచ్చిన నిండు గర్భిణీ ప్రసవానంతరం బాబు మరణించడంతో బంధువులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. బిజినపల్లి మండలం అనకాపల్లి తండ చెందిన జ్యోతి అనే నిండు గర్భిణీ పురిటి నొప్పులు రావడంతో గురువారం అర్ధరాత్రి జిల్లా ఆస్పత్రికి వచ్చింది. కానీ ప్రసవం చేయాల్సిన డ్యూటీ డాక్టర్ లేకపోవడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న సంబంధిత సిబ్బంది సాధారణ ప్రసవం కోసం […]

Update: 2021-06-25 01:10 GMT

దిశ, నాగర్ కర్నూల్ : ప్రసవం కోసం వచ్చిన నిండు గర్భిణీ ప్రసవానంతరం బాబు మరణించడంతో బంధువులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. బిజినపల్లి మండలం అనకాపల్లి తండ చెందిన జ్యోతి అనే నిండు గర్భిణీ పురిటి నొప్పులు రావడంతో గురువారం అర్ధరాత్రి జిల్లా ఆస్పత్రికి వచ్చింది. కానీ ప్రసవం చేయాల్సిన డ్యూటీ డాక్టర్ లేకపోవడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న సంబంధిత సిబ్బంది సాధారణ ప్రసవం కోసం ప్రయత్నించారు.

ఈ క్రమంలో అప్పుడే పుట్టిన బాబు మరణించాడు. దీంతో కోపోద్రిక్తులైన జ్యోతి కుటుంబీకులు ఆసుపత్రిలోని ఫర్నీచర్, అద్దాలను ధ్వంసం చేశారు. అనంతరం కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి కేవలం వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన బాబు మరణించాడని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. దీంతో దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర తీవ్ర ట్రాఫిక్‌‌ నిలిచిపోవడంతో పోలీసులు వారికి సర్ధిచెప్పె ప్రయత్నం చేస్తున్నారు.

Tags:    

Similar News