సీబీఎస్ఈ విద్యార్థులకు కొత్త అసెస్మెంట్ ఫ్రేమ్ వర్క్
దిశ, వెబ్‌డెస్క్: సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు సంబంధించి కొత్త అసెస్మెంట్ ఫ్రేమ్ వర్క్‌ను ప్రవేశపెట్టనుంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా అసెస్మెంట్ ఫ్రేమ్ వర్క్‌ను మార్చనుంది. విడతలు వారీగా దీనిని ప్రవేశపెట్టనుండగా.. 2024 కల్లా అన్ని సీబీఎస్‌ఈ పాఠశాలల్లో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. తొలుత కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ అసెస్మెంట్ ఫ్రేమ్ వర్క్ […]
దిశ, వెబ్‌డెస్క్: సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు సంబంధించి కొత్త అసెస్మెంట్ ఫ్రేమ్ వర్క్‌ను ప్రవేశపెట్టనుంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా అసెస్మెంట్ ఫ్రేమ్ వర్క్‌ను మార్చనుంది. విడతలు వారీగా దీనిని ప్రవేశపెట్టనుండగా.. 2024 కల్లా అన్ని సీబీఎస్‌ఈ పాఠశాలల్లో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు.
తొలుత కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ అసెస్మెంట్ ఫ్రేమ్ వర్క్ గురించి ఇప్పటికే రూపకర్తలు, ఐటెం రైటర్లు, మాస్టర్ ట్రైనర్ మెంటార్లకు శిక్షణ ఇస్తున్నారు. ఆల్ఫా ప్లస్, బ్రిటీష్ కౌన్సిల్‌లు ఈ విధానంను రూపొందించడంలో భాగస్వాములుగా ఉన్నారు.