దడ పుట్టిస్తున్న ఒమిక్రాన్.. జనవరి 14 వరకు లాక్‌డౌన్, స్కూల్స్ బంద్
దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ వణికిస్తోంది. ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. బ్రిటన్‌లో ఒక్కరోజే ఏకంగా 10,059 మంది ఒమిక్రాన్ బారిన పడ్డారు. దీంతో బ్రిటన్‌లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24,968కు చేరింది. ఇదిలా ఉండగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఒమిక్రాన్ కారణంగా డిసెంబర్ చివరి వారంలో లాక్‌డౌన్ విధించే ఆలోచన చేస్తున్నట్టు ఆ దేశ మీడియా కథనాలు రాసిన విషయం తెలిసిందే. మరోవైపు ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో నెదర్లాండ్స్ […]
దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ వణికిస్తోంది. ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. బ్రిటన్‌లో ఒక్కరోజే ఏకంగా 10,059 మంది ఒమిక్రాన్ బారిన పడ్డారు. దీంతో బ్రిటన్‌లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24,968కు చేరింది. ఇదిలా ఉండగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఒమిక్రాన్ కారణంగా డిసెంబర్ చివరి వారంలో లాక్‌డౌన్ విధించే ఆలోచన చేస్తున్నట్టు ఆ దేశ మీడియా కథనాలు రాసిన విషయం తెలిసిందే.
మరోవైపు ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో నెదర్లాండ్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలో క్రిస్మస్ లాక్‌డౌన్‌ను ప్రకటించింది. జనవరి 14 వరకూ అన్ని సాంస్కృతిక, వినోద కేంద్రాలు, కొన్ని దుకాణాలు మూసి ఉంటాయని ప్రధాని మార్క్ రుట్టే వెల్లడించారు. పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ కొనసాగనున్నట్టు పేర్కొన్నారు. జనవరి 9 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. క్రిస్మస్ రోజు మినహా.. మిగతా రోజుల్లో అతిథుల రాకపోకలపై కఠిన ఆంక్షలు అమల్లో ఉంటాయని హెచ్చరించారు.