కె-పాప్, స్వ్కిడ్ గేమ్ హిట్స్‌తో ‘కొరియన్’భాషకు పెరుగుతున్న ఆదరణ

దిశ, ఫీచర్స్: నెట్‌ఫ్లిక్స్ హిట్ షో ‘స్క్విడ్ గేమ్’ ప్రారంభమైనప్పటి నుంచి చాలామందికి కొరియన్ నేర్చుకోవాలనే ఆసక్తి పెరిగింది. వినోదం నుంచి సౌందర్య ఉత్పత్తుల వరకు దక్షిణ కొరియా సంస్కృతిపై పెరుగుతున్న ప్రపంచ వ్యామోహాన్ని నొక్కి చెబుతుండగా కొరియన్ పదాలు విశ్వవ్యాప్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ (OED) కొరియన్ మూలానికి చెందిన 26 కొత్త పదాలను దాని తాజా ఎడిషన్‌లో ‘హల్లు’ లేదా కొరియన్ వేవ్‌తో చేర్చింది. ఈ పదం దక్షిణ కొరియా సంగీతం, […]

Update: 2021-10-13 03:48 GMT

దిశ, ఫీచర్స్: నెట్‌ఫ్లిక్స్ హిట్ షో ‘స్క్విడ్ గేమ్’ ప్రారంభమైనప్పటి నుంచి చాలామందికి కొరియన్ నేర్చుకోవాలనే ఆసక్తి పెరిగింది. వినోదం నుంచి సౌందర్య ఉత్పత్తుల వరకు దక్షిణ కొరియా సంస్కృతిపై పెరుగుతున్న ప్రపంచ వ్యామోహాన్ని నొక్కి చెబుతుండగా కొరియన్ పదాలు విశ్వవ్యాప్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ (OED) కొరియన్ మూలానికి చెందిన 26 కొత్త పదాలను దాని తాజా ఎడిషన్‌లో ‘హల్లు’ లేదా కొరియన్ వేవ్‌తో చేర్చింది. ఈ పదం దక్షిణ కొరియా సంగీతం, సినిమా, టీవీ ప్రపంచ విజయాన్ని వివరించడానికి విస్తృతంగా ఉపయోగించారు.

‘స్క్విడ్ గేమ్’ ప్రీమియర్ తర్వాత రెండు వారాల్లో బ్రిటన్‌లో కొరియన్ నేర్చుకోవడానికి కొత్త యూజర్‌లు 76%, యునైటెడ్ స్టేట్స్‌లో 40% పెరిగినట్లు లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్ డుయోలింగో నివేదించింది. ఆసియాలో నాల్గో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన దక్షిణ కొరియా, దాని శక్తివంతమైన పాప్-కల్చర్‌తో గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా స్థిరపడగా, కొరియన్ సినిమాలు ప్రపంచ ఆదరణ పొందుతున్నాయి. తాజాగా నెట్‌ఫ్లిక్స్ ‘స్వ్కిడ్ గేమ్’ ఊహించని స్థాయిలో సూపర్ స్మాష్ హిట్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే కొరియా నేర్చుకునేందుకు ఇతర దేశీయులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మేరకు పిట్స్‌బర్గ్‌కు చెందిన డుయోలింగో‌లో 7.9 మిలియన్లకు పైగా క్రియాశీల వినియోగదారులు కొరియన్ నేర్చుకుంటుండగా, హిందీ తర్వాత వేగంగా అభివృద్ధి చెందుతున్న రెండో భాష అని డుయోలింగో తెలిపింది. ఇక కొరియా ఫౌండేషన్ ఫర్ ఇంటర్నేషనల్ కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 77 మిలియన్ కొరియన్ మాట్లాడేవారు ఉన్నారు. దక్షిణ కొరియా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న కింగ్ సెజోంగ్ ఇన్‌స్టిట్యూట్‌లో గతేడాది 82 దేశాలలో 76,000 మంది విద్యార్థులు ఉండగా, 2007లో ఈ సంఖ్య కేవలం 740 మందికే పరిమితం కావడం గమనార్హం.

‘భాష, సంస్కృతి అంతర్గతంగా అనుసంధానించబడి ఉంటాయి. పాప్ సంస్కృతి, మీడియాలో జరిగేవి తరచుగా భాష, భాషా అభ్యాస ధోరణులను ప్రభావితం చేస్తాయి. కొరియన్ సంగీతం, చలనచిత్రం, టెలివిజన్‌కు పెరుగుతున్న ప్రపంచ ప్రజాదరణ వల్ల కొరియన్ నేర్చుకోవడానికి డిమాండ్ పెరుగుతుండటం సంతోషకరం.
-సామ్ డాల్సిమర్, డుయోలింగో ప్రతినిధి

‘భాషపై ప్రావీణ్యం సంపాదించాలని కోరుకుంటున్నాను. కె-డ్రామాలను ఉపశీర్షికలు లేకుండా చూడవచ్చు. అనువాద సాహిత్యం అవసరం లేకుండా కె-పాప్ వినొచ్చు. రెండేళ్ల క్రితం నేర్చుకోవడం ప్రారంభించినప్పటి నుంచి ఈ భాష మరింత ప్రాచుర్యం పొందుతోంది.
– మిలికా మార్టినోవిక్, రష్యా, సెజోంగ్ ఇనిస్టిట్యూట్ విద్యార్థిని

స్క్విడ్ గేమ్ లేదా బీటీఎస్ వ్యామోహానికి ముందు కూడా కొరియన్ నేర్చుకోవాలనుకునే వేలాది మంది ఉన్నారు. అయినప్పటికీ ఇటీవల ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మా టాక్ టు మి ఇన్ కొరియన్‌లో 190 దేశాల్లో 1.2 మిలియన్ సభ్యులు కొరియన్ చదువుతున్నారు.
– సన్ హ్యూన్-వూ, ఈ-లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ టాక్ టు మి ఇన్ కొరియన్ వ్యవస్థాపకుడు

Tags:    

Similar News