రోటేరీయన కేవీ చలమయ్యకు ఉపరాష్ట్రపతి పరామర్శ
ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు నెల్లూరు జిల్లా రోటరీ క్లబ్ కార్యదర్శి పాల్ హేరిస్ ఫెలో రికగ్నిషన్ ( పీహెచ్ఎఫ్) కేవీ. చలమయ్యను పరామర్శించారు. నేటి ఉదయం చలమయ్యకు ఫోన్ చేసిన వెంకయ్యనాయుడు క్షేమ సమాచారం అడిగారు. కరోనా ఆందోళనల నేపథ్యంలో ఆయన తీసుకుంటున్న జాగ్రత్తల గురించి వాకబు చేశారు. కుటుంబ సభ్యుల క్షేమ సమాచారం అడిగారు. అనంతరం నెల్లూరు జిల్లా రోటరీ క్లబ్ చేపడుతున్న సేవా కార్యక్రమాల గురించి ఆరాతీశారు. దీనిపై చలమయ్య ఆయనకు కరోనా కష్టకాలంలో […]
ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు నెల్లూరు జిల్లా రోటరీ క్లబ్ కార్యదర్శి పాల్ హేరిస్ ఫెలో రికగ్నిషన్ ( పీహెచ్ఎఫ్) కేవీ. చలమయ్యను పరామర్శించారు. నేటి ఉదయం చలమయ్యకు ఫోన్ చేసిన వెంకయ్యనాయుడు క్షేమ సమాచారం అడిగారు. కరోనా ఆందోళనల నేపథ్యంలో ఆయన తీసుకుంటున్న జాగ్రత్తల గురించి వాకబు చేశారు. కుటుంబ సభ్యుల క్షేమ సమాచారం అడిగారు. అనంతరం నెల్లూరు జిల్లా రోటరీ క్లబ్ చేపడుతున్న సేవా కార్యక్రమాల గురించి ఆరాతీశారు.
దీనిపై చలమయ్య ఆయనకు కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకునేందుకు మార్చి 21 నుంచి ఆర్టీసీ బస్టాండ్ పక్కనున్న రోటరీ క్లబ్ ఆవరణలో ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 11:30 గంటల వరకు ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తున్నట్టు వివరించారు. రోజూ సుమారు 200 మంది నిరుపేదలు ఈ ఉచిత భోజనం సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నట్టు తెలుపగా సంతోషం వ్యక్తం చేశారు.
వెంకయ్యనాయుడు ఫోన్ చేయడంపై చలమయ్య హర్షం వ్యక్తం చేశారు. ఉపరాష్ట్రపతి గొప్ప మనసుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
tags: nellore, rotary club, free food, lockdown, free service. kv chalamaiah, rotarian