ఆ హెలికాప్టర్‌లో వచ్చిన వారిపై కేసు

దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లాలో హెలికాప్టర్ ల్యాండింగ్ వివాదస్పమైంది. ఏకంగా జిల్లా కలెక్టరే జోక్యం చేసుకోని విచారణకు ఆదేశించడంతోపాటు కేసులు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అనంతసాగర్‌ మండలం రేవూరుకు చెందిన జనార్ధన్ రెడ్డి అనే ఎన్నారై లాక్ డౌన్‌కు ముందు గ్రామానికి వచ్చారు. కాగా ఆయన కూతురు వివాహాం గురువారం జరగనుంది. ఈ వేడుకకు రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ డాక్టర్ వి.రామకోటేశ్వర్ రావు తన ఫ్యామిలీతో హైదరాబాద్ నుంచి కడపకు విమానంలో […]

Update: 2020-10-28 10:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లాలో హెలికాప్టర్ ల్యాండింగ్ వివాదస్పమైంది. ఏకంగా జిల్లా కలెక్టరే జోక్యం చేసుకోని విచారణకు ఆదేశించడంతోపాటు కేసులు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అనంతసాగర్‌ మండలం రేవూరుకు చెందిన జనార్ధన్ రెడ్డి అనే ఎన్నారై లాక్ డౌన్‌కు ముందు గ్రామానికి వచ్చారు. కాగా ఆయన కూతురు వివాహాం గురువారం జరగనుంది. ఈ వేడుకకు రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ డాక్టర్ వి.రామకోటేశ్వర్ రావు తన ఫ్యామిలీతో హైదరాబాద్ నుంచి కడపకు విమానంలో వచ్చారు. అక్కడి నుంచి బెంగళూరుకు చెందిన హెలికాప్టర్‌లో రేవూరుకు వచ్చారు. హెలికాప్టర్‌ను రేవూరు ప్రభుత్వ పాఠశాల గ్రౌండ్‌లో ల్యాండ్ చేశారు. అయితే హెలికాప్టర్ ల్యాండింగ్‌పై జిల్లా యంత్రాంగానికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో సీరియస్ అయిన కలెక్టర్ విచారణకు ఆదేశించారు. అలాగే హెలికాప్టర్‌లో వచ్చిన ఏడుగురు, హైస్కూల్ హెడ్ మాస్టర్‌పై కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News