వేలంలో భారీ ధర పలికిన నీరజ్ జావెలిన్.. సింధు రాకెట్
దిశ, స్పోర్ట్స్: టోక్యో ఒలింపిక్స్ 2020లో పతకాలు సాధించిన నీరజ్ చోప్రా, పీవీ సింధుతో పాటు పలువురు అథ్లెట్లు తమ క్రీడా పరికరాలను ప్రధాని మోదీకి బహుమతిగా అందించిన విషయం తెలిసిందే. ఒలింపిక్స్, పారాఒలింపిక్స్‌లో పాల్గొన్న అథ్లెట్లు ఇచ్చిన బహుమతులను తాజాగా ఈ-వేలం వేశారు. ప్రధాని మోదీ పుట్టిన రోజైన సెప్టెంబర్ 17న మొదలైన ఈ వేలం అక్టోబర్ 7 న ముగిసింది. ఇందులో స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా ఇచ్చిన జావెలిన్ (ఈటె) అన్నింటి […]
దిశ, స్పోర్ట్స్: టోక్యో ఒలింపిక్స్ 2020లో పతకాలు సాధించిన నీరజ్ చోప్రా, పీవీ సింధుతో పాటు పలువురు అథ్లెట్లు తమ క్రీడా పరికరాలను ప్రధాని మోదీకి బహుమతిగా అందించిన విషయం తెలిసిందే. ఒలింపిక్స్, పారాఒలింపిక్స్‌లో పాల్గొన్న అథ్లెట్లు ఇచ్చిన బహుమతులను తాజాగా ఈ-వేలం వేశారు. ప్రధాని మోదీ పుట్టిన రోజైన సెప్టెంబర్ 17న మొదలైన ఈ వేలం అక్టోబర్ 7 న ముగిసింది. ఇందులో స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా ఇచ్చిన జావెలిన్ (ఈటె) అన్నింటి కంటే ఎక్కువగా రూ. 1.5 కోట్లు పలికింది. ఇక భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఇచ్చిన రాకెట్ రూ. 80,00,100 దక్కింది.
వేలం ప్రారంభమైన రోజు నీరజ్ చోప్రా ఈటెకు ఒకరు రూ. 10 కోట్ల బిడ్ దాఖలు చేశారు. అయితే బిడ్ వేసిన వ్యక్తి పూర్తి వివరాలు లేకపోవడంతో అది నకిలీదని భావించి తొలగించారు. ఇక ఫెన్సర్ భవానీ దేవి ఇచ్చిన ఫెన్స్‌కు రూ. 1.25 కోట్లు, బాక్సర్ లవ్లీనా బొర్గెహెన్ గ్లౌజులు రూ. 91 లక్షలు, పారా జావెలిన్ త్రోయర్ సుమిత్ ఈటెకు రూ.1 కోటి 25 వేలు.. పారాలింపిపిక్స్ విజేతలు సంతకాలు చేసి అందించిన టవల్‌కు రూ. 1 కోటి లభించింది. ఈ వేలంలో మొత్తం 1348 వస్తువులకు వేలం నిర్వహించగా 8600 బిడ్లు వచ్చాయి. ఈ వేలం ద్వారా వచ్చిన సొమ్మును గంగా నది ప్రక్షాళన కోసం వెచ్చించనున్నారు.