Kishan Reddy : చర్లపల్లి..కాచిగూడ రైల్వే స్టేషన్లకు ఆధునీకరణ హంగులు : కిషన్ రెడ్డి

చర్లపల్లి, కాచిగూడ(Charlapalli..Kachiguda) రైల్వే స్టేషన్ల(Railway Stations) ఆధునీకరణ (Modernization)పనులు పూర్తి కాగా త్వరలో ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు.

Update: 2024-11-16 06:19 GMT

దిశ, వెబ్ డెస్క్ : చర్లపల్లి, కాచిగూడ(Charlapalli..Kachiguda) రైల్వే స్టేషన్ల(Railway Stations) ఆధునీకరణ (Modernization)పనులు పూర్తి కాగా త్వరలో ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి (Kishan Reddy) వెల్లడించారు. రూ.428 కోట్లతో చర్లపల్లి రైల్వే స్టేషన్ లో కొత్త శాటిలైట్ టెర్మినల్, తగిన పార్కింగ్ సౌకర్యాలతో పెద్ద సర్క్యులేటింగ్ ప్రాంతం, అన్ని ప్లాట్‌ ఫారమ్‌లను కలుపుతూ 5 లిఫ్టులు, 5 ఎస్కలేటర్లు, పార్శిల్ బుకింగ్ సౌకర్యాలు, అన్ని ఆధునిక ప్రయాణీకుల సౌకర్యాలను కలిగి ఉంటుందని తెలిపారు. స్టేషన్ 25 జతల రైళ్లను నిర్వహించగలదని, మొత్తం 19 లైన్ల సామర్థ్యంతో 10 కొత్త లైన్లు జోడించబడ్డాయని కిషన్ రెడ్డి వివరించారు.

అటు హైదరాబాద్, సికింద్రాబాద్ స్టేషన్లలో రద్దీని తగ్గించడానికి కాచిగూడ స్టేషన్ సామర్ధ్యాన్ని పెంచామని తెలిపారు. స్టేషన్ ను పెరిగిన ఫుట్‌ఫాల్ కు అనుగుణంగా రూపొందించబడిన ఆధునిక వసతులతో అభివృద్ధి చేశామని కిషన్ రెడ్డి వెల్లడించారు.

Tags:    

Similar News