BJP MP : కేటీఆర్ కేంద్రమంత్రి ఖట్టర్‌ను కలవలేదు! కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఇటీవల ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలినట్లు బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి (Union Minister Manohar Lal Kattar) మనోహర్ లాల్ ఖట్టర్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కలినట్లు బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి (BJP MP Konda Vishweshwar Reddy) తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రముఖ చానల్‌తో ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో ఇటీవల కేటీఆర్ కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలవలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కలిస్తే ఫోటోలు ఉంటాయి కదా? అని ప్రశ్నించారు.
అయితే, కేంద్ర మంత్రి అపాయింట్‌మెంట్ తీసుకున్నారని, కానీ ఆయన్ను బయట నుంచి బయటకు పంపించారని చెప్పారు. కేటీఆర్‌ను ఢిల్లీలో బీజేపీ నాయకులు ఒక్కరు కూడా కలవలేదని, అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదన్నారు. ఎందుకంటే నేను కూడా ఖట్టర్ ఆఫీస్ పోయి పీఏతో మాట్లాడిన.. ఇటీవలే ఢిల్లీ నుంచి వచ్చానని స్పష్టం చేశారు. కేటీఆర్ ఢిల్లీలో కాంగ్రెస్ నాయకులను కలిశారని అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయాలని ఉందని, జాతీయ కాంగ్రెస్ నాయకత్వం అరెస్ట్ కాకుండా అడ్డుకుంటుందని ఆరోపించారు. కాగా, తెలంగాణ రాష్ట్రంలో అమృత్ పథకం టెండర్లపై విచారణ జరిపి అక్రమాలు వెలికి తీయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ను కలవడానికి ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే.