Lagacharla case: లగచర్ల ఘటనలో మరో 8 మంది అరెస్టు.. ఎస్సీ ఎస్టీ కమిషన్ వద్దకు స్థానికులు

లగచర్ల ఘటనలో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు.

Update: 2024-11-16 06:15 GMT
Lagacharla case: లగచర్ల ఘటనలో మరో 8 మంది అరెస్టు.. ఎస్సీ ఎస్టీ కమిషన్ వద్దకు స్థానికులు
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: వికారాబాద్ జిల్లా లగ చర్ల (Lagacharla) కలెక్టర్ పై దాడి కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటనలో తాజాగా మరో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. లగచర్ల గ్రామస్థులను అదుపులోకి తీసుకుని పరిగి పోలీసు (Parigi Police) స్టేషన్ కు తరలించారు. అక్కడ వారిని విచారిస్తున్నారు. అనంతరం 8 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి వారిని కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కేసులో ఇప్పటికే 17 మందిని అరెస్టు చేసిన పోలీసులు వారిని రిమాండుకు తరలించారు. ఇందులో 16 మంది నిందితులను పరిగి జైలు నుంచి సంగారెడ్డి జైలుకు తరలించారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొడగంల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి (Patnam Narendar Reddy) ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్నారు. అయితే రాష్ట్ర రాజకీయాల్లో సంచలన సృష్టిస్తున్నఈ లగచర్ల ఘటనపై డీజీ మహేశ్ భగవత్ (DG Mahesh Bhagavath) వివరాలు సేరిస్తున్నారు. లగచర్లతో పాటు పరిసర గ్రామాల్లో పరిస్థితిపై అడిషనల్ డీజీ ఆరా తీశారు. పరారీలో ఉన్న వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

ఎస్సీ, ఎస్టీ కమిషన్ వద్దకు లగచర్ల వాసులు:

ఈ ఘటనలో తమపై పోలీసులు, ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్న లగచర్ల గిరిజన కుటుంబాలు ఎస్సీ, ఎస్టీ కమిషన్ (SC, ST Commission)ను కలవబోతున్నట్లు సమాచారం. వీరికి బీఆర్ఎస్ నేతలు సంఘీభావం తెలపనున్నట్లు తెలుస్తున్నది. తమ కుటుంబ సభ్యుల అరెస్టులు, చోటు చేసుకున్న పరిణామాలపై కమిషన్ కు లగచర్ల వాసులు వివరించబోతున్నారు.

Tags:    

Similar News