Posani Krishna Murali: నటుడు పోసాని కృష్ణమురళిపై మరో కేసు

వైసీపీ నేత, నటుడు పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali)పై మరో కేసు నమోదైంది.

Update: 2024-11-16 06:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ నేత, నటుడు పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali)పై మరో కేసు నమోదైంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan), మంత్రి నారా లోకేష్‌(Nara Lokesh)పై చేసిన అనుచిత వాఖ్యలపై కడప జిల్లాలోని రిమ్స్ పోలీస్ స్టేషన్‌లో బీసీ సెల్ ఉపాధ్యక్షుడు వెంకట సుబ్బయ్య, నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు భాస్కర్ కంప్లైంట్ చేశారు. ఇప్పటికే రాజంపేట పోలీస్ స్టేషన్‌లోనూ వీరు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా.. టీడీపీ, జనసేన నేతలు పోసానిపై వరుస ఫిర్యాదులు చేస్తున్నారు.

ఇప్పటివరకు మొత్తం పోసాని మీద 50కి పైగా ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. అలాగే అనంతపురంలో పోసాని దిష్టి బొమ్మను సైతం తెలుగు యువత, ఎస్సీ సెల్ నాయకులు దహనం చేశారు. ఈ మేరకు నమోదైన కేసులో విచారణకు హాజరు కావాలని పోసానికి రెండు మూడు రోజుల్లో నోటీసులు జారీ చేస్తామని పోలీసులు తెలిపారు. కాగా మరోవైపు సినీ నటి శ్రీరెడ్డిపై సైతం పలు పోలీస్టేషన్‌లలో ఫిర్యాదులు చేయగా.. వాటిలో మూడు కేసులు నమోదయ్యాయి.

Read More...

RGV : నోటీసులపై ఆర్జీవీ స్పందన ఇదే!


Tags:    

Similar News