క్రిప్టోకరెన్సీ నియంత్రణ కోసం కేంద్రం వ్యూహాత్మక చర్యలు..

దిశ, వెబ్‌డెస్క్: క్రిప్టోకరెన్సీ నియంత్రణ కోసం అవసరమైన చర్యలు తీసుకునేందుకు కేంద్రం వ్యూహాత్మకంగా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దీనికోసం ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీ, టెక్నాలజీ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ నియంత్రణకు ప్రపంచ దేశాలు ఉమ్మడిగా కార్యాచరణ చేపట్టాలని అన్నారు. రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని కట్టడి చేసేందుకు నియంత్రణ సంస్థలకు ఒక విధానం కావాలని శుక్రవారం జరిగిన ఇన్ఫినిటీ ఫోరమ్ కార్యక్రమంలో చెప్పారు. ప్రస్తుతానికి కేంద్ర జాతీయ స్థాయిలో టెక్నాలజీ ఆధారిత […]

Update: 2021-12-03 10:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: క్రిప్టోకరెన్సీ నియంత్రణ కోసం అవసరమైన చర్యలు తీసుకునేందుకు కేంద్రం వ్యూహాత్మకంగా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దీనికోసం ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీ, టెక్నాలజీ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ నియంత్రణకు ప్రపంచ దేశాలు ఉమ్మడిగా కార్యాచరణ చేపట్టాలని అన్నారు. రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని కట్టడి చేసేందుకు నియంత్రణ సంస్థలకు ఒక విధానం కావాలని శుక్రవారం జరిగిన ఇన్ఫినిటీ ఫోరమ్ కార్యక్రమంలో చెప్పారు.

ప్రస్తుతానికి కేంద్ర జాతీయ స్థాయిలో టెక్నాలజీ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ నియంత్రణ కోసం ఆలోచిస్తున్నామని, నమ్మకం మీద మదుపర్లు వినియోగించే క్రిప్టోకరెన్సీ ఎక్కడ ఉంది, టెక్నాలజీ ఆధారంగా చేసే చెల్లింపులు ఎలా జరుగుతున్నాయి లాంటి వివరాలేమీ తెలీదని, అందుకోసం పర్యవేక్షణ కావాలని నిర్మలా సీతారామన్ వివరించారు. కేంద్రం క్రిప్టోకరెన్సీ నియంత్రణ కోసం సిద్ధమవుతున్న సమయంలో ఆర్థిక మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags:    

Similar News