మైక్రోచిప్ నిఘా.. ఇకపై పశువులు రోడ్డెక్కితే యాజమానికి వాచిపోవాల్సిందే!
దిశ, వెబ్‌డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో ట్రాఫిక్ సమస్యల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వాహనాల రద్దీని తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా అంతగా ఫలితాలనివ్వలేదు. దీంతో పొల్యుషన్ కూడా తీవ్రస్థాయిలో పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు 2019 నవంబర్‌లో కేజ్రీవాల్ ప్రభుత్వం వాహనాల వినియోగంలో ‘సరి, బేసి’ విధానాన్ని కూడా తీసుకొచ్చింది. వాహనాలకు సూచించిన సరి, బేసి నెంబర్ సిస్టమ్ ప్రకారం.. ఆ వాహనాలు ఆయా […]
దిశ, వెబ్‌డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో ట్రాఫిక్ సమస్యల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వాహనాల రద్దీని తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా అంతగా ఫలితాలనివ్వలేదు. దీంతో పొల్యుషన్ కూడా తీవ్రస్థాయిలో పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు 2019 నవంబర్‌లో కేజ్రీవాల్ ప్రభుత్వం వాహనాల వినియోగంలో ‘సరి, బేసి’ విధానాన్ని కూడా తీసుకొచ్చింది. వాహనాలకు సూచించిన సరి, బేసి నెంబర్ సిస్టమ్ ప్రకారం.. ఆ వాహనాలు ఆయా తేదీల్లోనే రోడ్డుమీదకు రావాలి. మిగతా రోజుల్లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును నమ్ముకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలో పెరిగిపోతున్న ట్రాఫిక్, వాతావరణ కాలుష్యం నివారణకు సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ మార్గదర్శకాల ప్రకారం ఆప్ సర్కార్ ఈ మేరకు చర్యలు చేపట్టింది.
అయితే, రాజధానిలో విపరీతమైన కాలుష్యం వలన ఏర్పడే పొగమంచుతో ఉదయం వేళ ఎక్కువ మంది ప్రమాదాలకు గురయ్యేవారు. దీనికి తోడు పశువులు రోడ్డుకు అడ్డుగా రావడం ట్రాఫిక్ పెరగడంతోపాటు యాక్సిడెంట్లు జరగడానికి ఓ ప్రధాన కారణం. కొన్నేళ్లుగా రాజధాని రోడ్లపై పశువులు సంచరిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చేది. వాటిని అక్కడి నుంచి తరలించేందుకు ట్రాఫిక్ పోలీసులు కూడా నానా తంటాలు పడేవారు. ఈ పశువులు ఢిల్లీని ఆనుకుని ఉన్న రూరల్ ఏరియాస్ నుంచే ఎక్కువగా వస్తున్నట్లు నార్త్ ఢిల్లీ అధికారులు గుర్తించారు. అంతేకాకుండా.. కాపరులు, యాజమానుల నిర్లక్ష్యం వల్లే పశువులు ఇష్టానుసారంగా రోడ్డెక్కుతున్నాయని తమ దర్యాప్తులో తేలడంతో నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (NMDC) కీలక నిర్ణయం తీసుకుంది.
ఢిల్లీ పరిసరాల్లో సంచరిస్తున్న పశువులకు మైక్రోచిప్ అమర్చాలని నిర్ణయించింది. ఇందులో ఆ పశువులకు చెందిన పూర్తి సమాచారంతో పాటు యాజమాని వివరాలు కూడా ఉంటాయి. త్వరలోనే వీటిని పశువులకు అమర్చాలని నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (NMDC) హౌస్ లీడర్ యోగేశ్ వర్మ గురువారం సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఒక్కసారి మైక్రోచిప్‌లను అమర్చాక.. పశువులు ఇష్టానుసారం రోడ్ల మీదకు వస్తే యాజమానికి రూ.25 వేల జరిమానా విధించనున్నారు. ఈ ప్రతిపాదనను ఎన్‌ఎండీసీ స్టాండింగ్ కమిటీ కూడా ఆమోదించినట్లు సమాచారం. ఈ కొత్త నిబంధన వలన పశువులు రోడ్ల మీదకు రావడం తగ్గితే ఢిల్లీ వాసులకు కొంత మేర ట్రాఫిక్ సమస్య తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.