నేను ఢిల్లీకి పోతా..
తనకు మంత్రి పదవి, అల్లుడికి ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదని అజ్ఞాతంలోకి వెళ్లిన తెలంగాణ మాజీ హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి చాలా రోజుల తర్వాత అజ్ఞాతం వీడారు.తెలంగాణలో ప్రస్తుతం టిక్కెట్ల పంచాయతీ నడుస్తుండటంతో బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. అనగా రాష్ట్రంలో రెండు రాజ్యసభ, రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో ఆశవాహులు తీవ్రంగా లాబీయింగ్ చేస్తున్నారు.దీనిపై స్పందించిన నాయిని తాను రాజ్యసభ సభ్యునిగా ఢిల్లీకి వెళ్లేందుకు నిశ్చియించుకున్నానని, అదే విషయాన్ని సీఎం కేసీఆర్‌కు కూడా వివరించినట్టు చెప్పుకొచ్చారు. […]
తనకు మంత్రి పదవి, అల్లుడికి ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదని అజ్ఞాతంలోకి వెళ్లిన తెలంగాణ మాజీ హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి చాలా రోజుల తర్వాత అజ్ఞాతం వీడారు.తెలంగాణలో ప్రస్తుతం టిక్కెట్ల పంచాయతీ నడుస్తుండటంతో బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. అనగా రాష్ట్రంలో రెండు రాజ్యసభ, రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో ఆశవాహులు తీవ్రంగా లాబీయింగ్ చేస్తున్నారు.దీనిపై స్పందించిన నాయిని తాను రాజ్యసభ సభ్యునిగా ఢిల్లీకి వెళ్లేందుకు నిశ్చియించుకున్నానని, అదే విషయాన్ని సీఎం కేసీఆర్‌కు కూడా వివరించినట్టు చెప్పుకొచ్చారు. అయితే తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కేసీఆర్‌కు తోడుగా ఉన్న నాయినికి గులాబీ బాస్ మొదటి టర్మ్‌లో హోంమంత్రిగా అవకాశం ఇచ్చారు. రెండోసారి కూడా మంత్రి పదవి వస్తదని ఆశపెట్టకున్నఆయనకు నిరాశే ఎదురైంది. గులాబీ గూడులో కొత్త నీరు వచ్చి చేరడంతో వారికి ప్రాధాన్యత కల్పించారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయినికి ఆర్టీసీ ఎండీ పదవిని ఆఫర్ చేశారు.అది ఇష్టం లేని మాజీ హోంమంత్రి సున్నితంగా ఆ ఆఫర్‌ను తిరస్కరించి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మళ్లీ ఇన్నిరోజులకు బయటకు వచ్చిన నాయిని కోరిక నెరవేరుతుందో లేదో వేచి చూడాల్సిందే.
tags ; ex home minister nayani narasimha reddy, cm kcr, rtc md, rajya sabha ticket, delhi